V1News Telangana

best news portal development company in india

కార్యకర్తలకు ఊపిరి పోస్తున్న ఏనుగు రవీందర్ రెడ్డి….

SHARE:

గత పది సంవత్సరాలనుండి బాన్స్వాడ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పట్టించుకునే సరైన నాయకులు లేరు. నాయకులు ఉన్న కాంగ్రెస్ పార్టీ బాన్స్వాడ లో వర్గాలు గా విడిపోయింది అయితే బాన్స్వాడ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి గా బాధ్యత లు తీసుకున్న ఏనుగు రవీందర్ రెడ్డి కార్యకర్తల ను ఏకం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్న ప్రతి కార్యకర్త నవాడే అంటూ అందరిని సమాన ద్రుష్టి తో చూస్తూ వారికి అండగా నిలబడుతున్నారు. అయన బాన్స్వాడ నియోజకవర్గం లో అడుగు పెట్టినప్పటి నుండి మండల స్థాయిలో భారీగా చేరికలు జరుగుతున్నాయి.

గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో బాన్స్వాడ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గా పోటీ చేసి ఓడిన ఏనుగు రవీందర్ రెడ్డి నియోజకవర్గం లో తన దైన శైలితో ప్రజా సేవ చేస్తున్నారు. ఎమ్మెల్యే గా పోటీ చేసి ఒడిన ప్రజలే ముఖ్యం ప్రజా సేవే నా లక్ష్యం అనే దిశగా ఏనుగు రవీందర్ రెడ్డి నియోజకవర్గం నీ అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నారు.ప్రజా శ్రేయస్సు కోసం పగలు రాత్రి కష్టపడుతున్నా నాయకుడు ఏనుగు రవీందర్ రెడ్డి అంటు బాన్స్వాడ ప్రజలు ఆయనను అభినందిస్తున్నారు.కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు భరోసానిస్తూ వారికి అండగా నిలబడుతూ పార్టీ నీ బాన్స్వాడ నియోజకవర్గం లో మరింత బలపరుస్తున్నారు ఏనుగు రవీందర్ రెడ్డి.

IRFAN Reporter
Author: IRFAN Reporter

Work from as a journalist

best news portal development company in india