V1News Telangana

best news portal development company in india

నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునః ప్రారంభనికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి వుంది – పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు

SHARE:

నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునః ప్రారంభనికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి వుంది – పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు..

నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునః ప్రారంభనికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి వుంది
అని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. బోధన్ పట్టణంలోని నిజాం షుగర్ ఫ్యాక్టరీలో రైతుతో ముఖాముఖి చర్చ వేదిక నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కెమినేట్ సబ్ కమిటీ కార్యక్రమానికి హాజరైన వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని, బిజెపి నాయకులకు రైతుల పట్ల చిత్తుశుద్ధి లేదన్నారు. తొందర్లోనే నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునః ప్రారంభానికి కృషి చేస్తామని వారు తెలిపారు.రైతులకు అవసరమైన పరిశ్రమలను తీసుకొస్తామని,రైతులకు కవల్సిన ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను స్థాపనకు కృషి చేస్తామన్నారు.ఈ సందర్భంగా ఫ్యాక్టరీ యంత్రాలు, భవనాల తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం ఫ్యాక్టరీ కార్మికులతో ముచ్చటించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, భూపతి రెడ్డి, ఎనుగుల రవీందర్ రెడ్డి, మున్సిపల్ ఛైర్ పర్సన్ పద్మావతి ,కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు,రైతులు, నియోజకవర్గ నాయకులు ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india