తెలంగాణ రాష్ట్రంలోని ఏసీపీ,డిఎస్పీలను బదిలీ చేస్తూ తెలంగాణా రాష్ట్ర డీజీపీ రవి గుప్తా ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు. ఒకే సారి 110 మంది డిఎస్పీలను బదిలీలు చేశారు.
ఇందులో వరంగల్ పోలీస్ కమీషనరేట్లో పని చేస్తున్న ఏడుగురు ఎసిపిలను సైతం ఉన్నారు.వర్ధన్నపేట ఏసీపీ డి.రఘుచందర్ ను జగిత్యాల డిఎస్పీగా బదిలీ చేసి, వర్ధన్నపేట ఏసీపీగా సికింద్రాబాద్ అర్బన్ డీఎస్ఆర్పీ గా ఉన్న అంబటి.నర్సయ్య ను నియమించారు.
మామూనూరు ఎసిపి గా ఉన్న సి సతీష్ బాబును డిజిపి ఆఫీసులో రిపోర్ట్ చేయాలని పేర్కొంటూ, మామూనూరు ఏసీపీ గా కొత్తగూడెం డిఎస్పీ షేక్ అబ్దుల్ రెహ్మాన్ ను నియమించారు.
జనగామ ఏసీపీ గా ఉన్న కొత్త.దేవేందర్ రెడ్డిని హన్మకొండ ఏసీపీ గా నియమించారు. జనగామ ఏసీపీ గా డిజిపి ఆఫీస్ కంట్రోల్ రూమ్ డిఎస్పీగా ఉన్న ఎస్ ఆర్ దామోదర్ రెడ్డిని జనగామ ఏసీపీగా నియమించారు.
హన్మకొండ ఏసీపీగా కొనసాగుతున్న వి.కిరణ్ కుమార్ ను నర్సంపేట ఏసీపీ గాను, నర్సంపేట ఏసీపీ పి.తిరుమల్ ను వరంగల్ ట్రాఫిక్ ఏసీపీగా పోస్టింగ్ ఇచ్చారు.
వరంగల్ ట్రాఫిక్ ఏసీపీ ఎం. బోజరాజు ను వరంగల్ పిటిసి,డిఎస్పీ గా ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసి రామగుండం సీసీఎస్ ఏసీపీగా నియమించారు.
కానీ కరీంనగర్ పిటిసిలో డిఎస్పీగా చేస్తున్న మహేష్ కుమార్ ను కూడా రామగుండం ఏసీపీగానే నియమిస్తున్నట్లుగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే కాజీపేట ఏసీపీ డేవిడ్ రాజ్ ను డిఎస్పీ పిటిసి, కరీంనగర్ కు, సిరిసిల్ల డీఎస్ ఆర్బీ డిఎస్పీ కె రవీందర్ ను వరంగల్ పిటిసి డిఎస్పీగా నియ మించారు.
అలాగే జయశంకర్ భూపాలపల్లి డిఎస్పీ గా ఎస్ ఐ బి ఇంటిలిజెన్స్ గా ఏ.సంపత్ రావు ను నియమించారు. గతంలో ఇక్కడి నుండే డిఎస్పీ గా ఎస్ ఐ బి ఇంటిలిజెన్స్ కు వెళ్ళి తిరిగి యధాస్థానానికి నియమితులయ్యారు.
మహబూబాబాద్ డిఎస్పీ టి.సత్య నారాయణ, భూపాలపల్లి డిఎస్పీ ఏ.రాములు లను డిజిపి ఆఫీస్ లో రిపోర్ట్ చేయాలని బదిలీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
మహబూబాబాద్ డిఎస్పీగా తిరుపతి రావు ను నియమించారు.కొమురం భీం ఆసిఫాబాద్ స్పెషల్ బ్రాంచ్ డి ఎస్పీ సి హెచ్ శ్రీనివాస్ జీ ని హుజురా బాద్ ఏసీపీ గా పోస్టింగ్ కల్పించారు..
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








