V1News Telangana

best news portal development company in india

రామగుండం కార్పొరేషన్ లో డివిజన్ల అభివృద్ధికి కృషి చేస్తాం 20 లక్షల నిధులతో రోడ్డు పనులు ప్రారంభం

SHARE:

రామగుండం కార్పొరేషన్ లో డివిజన్ల అభివృద్ధికి కృషి చేస్తాం

20 లక్షల నిధులతో రోడ్డు పనులు ప్రారంభం

రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం జనవరి 12:-

రామగుండం కార్పొరేషన్ పరిధిలో ప్రతి డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తామని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ అన్నారు. ఈ సందర్భంగా గోదావరిఖని 46వ డివిజన్ ఎన్టీఆర్ నగర్ లో 20 లక్షల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తో పాటు కల్వర్టులు, రోడ్డు పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ మాట్లాడుతూ… గత పాలకుల నిర్లక్ష్యంతో కార్పొరేషన్ పరిధిలో చాలా డివిజన్ లు అభివృద్ధికి ఆమడ దూరంగా ఉన్నాయన్నారు. ప్రణాళికతో కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి పనులు చేపడుతూ నియోజకవర్గాన్ని సుందరీకరణగా తీర్చిదిద్దుతామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అందజేస్తామన్నారు. ప్రజల సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తూ ప్రజా పాలన తీసుకువస్తామని తెలిపారు. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు వచ్చిన నేరుగా ప్రజలు నా దృష్టికి తీసుకువస్తే సమస్యల పరిష్కారానికి పాటుపడతామన్నారు. 46వ డివిజన్ కార్పొరేటర్ పాతపల్లి లక్ష్మి- ఎల్లయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ మేయర్ బంగి అనిల్ కుమార్,మున్సిపల్ కమిషనర్, కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి, కార్పొరేషన్ ఏఈ, డిఈ తో పాటు అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

best news portal development company in india