మహాలక్ష్మి పథకం కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన కానుక..
ముర్ముర్,ఎల్లంపల్లి గ్రామాల సమస్యలు పరిష్కరిస్తా
2 నెలల్లో గ్రామాలకు పూర్తి స్థాయిలో తాగునీటిని అందిస్తా
రైతులు పండించిన వరి ధాన్యానికి ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తుంది
ప్రజా ఆశీర్వాద సభలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్
V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం జనవరి :- 07

మహాలక్ష్మి పథకం.. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన కానుక అని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ అన్నారు. ఈ సందర్భంగా అంతర్గం మండలంలోని మురుమూరు, ఎల్లంపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు…ముర్ముర్, ఎల్లంపల్లి గ్రామాలలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని అన్నారు. అలాగే రెండు నెలల్లో పూర్తిస్థాయిలో మంచి నీటిని అందిస్తామన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో గ్రామాల ప్రజలు ఎంతో నష్టపోయారని పేర్కొన్నారు. అంతే కాకుండా నష్టపోయిన రైతులకు, భూములు కోల్పోయిన ప్రజలకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందే విధంగా అధికారులతో మాట్లాడతానని అన్నారు. నీతో పాటు రైతుల పండించిన వరి ధాన్యానికి మద్దతు ధర కల్పిస్తుందన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలో భాగంగా రెండు గ్యారెంటీ పథకాలను అమలు చేసిందన్నారు. బిఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పాలనలో చుక్కనీరు కూడా గ్రామాల ప్రజలకు అందించలేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం మొత్తం రామగుండం వైపు చూసే విధంగా ప్రజలు ఇచ్చిన తీర్పు మరువలేనిదని 70 శాతం ఓట్లతో అత్యధిక మెజారిటీతో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గత పాలకులు కాంట్రాక్టులు, కమిషన్ల కోసం పాటుపడ్డారు కానీ గ్రామాల అభివృద్ధికి కృషి చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. ప్రాజెక్టుల కోసం ఎంతో మంది రైతులు తమ భూములను త్యాగం చేసారని గుర్తు చేశారు.
Author: Namani Rakesh Netha
STAFF REPORTER RAMAGUNDAM








