V1News Telangana

best news portal development company in india

ఖని” ఎలక్ట్రానిక్ మీడియా నూతన కమిటీ ఎన్నిక

SHARE:

“ఖని” ఎలక్ట్రానిక్ మీడియా నూతన కమిటీ ఎన్నిక

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం డిసెంబర్ 31:-

గోదావరిఖని ప్రెస్ క్లబ్ అనుబంధంగా కొనసాగుతున్న ఎలక్ట్రానిక్ మీడియా ఎన్నికలు ప్రెస్ క్లబ్ ఆడిటోరియంలో అధ్యక్షుడు పూదరి కుమార్ సారధ్యంలో ప్రశాంతంగా ముగిశాయి. సభ్యుల అభిప్రాయం మేరకు నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా భైరం సతీష్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా మామిడి సత్యనారాయణ, కోశాధికారిగా మిక్కిలి శ్రీనివాస్ ఎన్నిక కాగా ఉపాధ్యక్షులుగా ఆవుల కృష్ణ, చందుపట్ల తిరుపతిరెడ్డి, సహాయ కార్యదర్శిగా జాన్ సుందర్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఆకునూరి రమేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికకు సహకరించిన సభ్యులందరికీ కొత్త కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దొబ్బల చంద్రశేఖర్, ఆరెల్లి కుమార్ తోపాటు ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు పాల్గొన్నారు.

Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

best news portal development company in india