V1News Telangana

best news portal development company in india

తానకాలాన్ లో ఘనంగా దత్తా జయంతి వేడుకలు….

SHARE:

..ఏడపల్లి మండలంలోని తానాకలాన్ గ్రామంలో ఈరోజు మాణిక్ ప్రభు మఠంలో దత్త జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఈ మాణిక్ ప్రభు మందిరమును రెండు వందల సంవత్సరాల క్రితం పూర్వీకులు హుమ్నాబాద్ లోని మాణిక్ నగర్ నుండి స్వామివారి నిర్గుణ పాదుకలు తెచ్చి తానాకలాన్ గ్రామంలో దత్త మఠం నిర్మించారు.

అప్పటినుండి ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధ దశమి మొదలుకొని పౌర్ణమి పర్యంతం ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు.ఈ ఉత్సవాలకు భక్తులు జిల్లా నలుమూలల నుండి అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.సంతానం లేనివారు దత్త జయంతి రోజున స్వామివారి ఉత్సవంలో పాల్గొని స్వామివారిని ఉయ్యాలలో పడుకోబెట్టి ఊపి అనంతరం స్వామివారిని ఒడిలో పెట్టుకుంటే సంతానం కలుగుతుందని భక్తులకు అపారమైన నమ్మకం.అలాగే ఆలయ ప్రాంగణంలో ఉన్న ఔదుంబర కల్పవృక్షన్ని దర్శించుకుంటే సుఖ సౌఖ్యములు,సంతానము, ఆయురారోగ్యాలు,అష్టైశ్వర్యాలు పొందుతారని ఇక్కడి పండితులు చెపుతున్నారు.స్వామి వారి జయంతి పురస్కరించుకొని స్వామివారిని పల్లకి సేవలో ఘనంగా ఊరేగించారు.పల్లకి సేవలో భక్తులు భజనలు చేస్తూ ఊరేగింపు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అనంతరం వచ్చిన భక్తుల సౌకర్యార్థం ఆలయ కమీటివారు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ భాస్కర్ రెడ్డి,ఎంపిటిసి సుమలత అనిల్,సురేష్,మురళీధర్, సంతోషం,గంగాధర్,కమలాకర్,గంగరాజు,యువకులు ముఖేష్,శ్రావణ్,పరుశురాం తదితరులు ఉన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india