V1News Telangana

best news portal development company in india

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల మూగజీవి మృతి

SHARE:

బోధన్ మండలం కల్దుర్కి గ్రామ శివారులో తన సొంత వ్యవసాయ పనులకు పవన్ తండ్రి : నాగ్ గొండ వయస్సు (26) వ్యవసాయ పనుల నిమిత్తం ఉదయం 8 నుంచి 9 గంటల సమయం మధ్యలో ఎడ్లని తీసుకొని తన పొలం గెట్టు పక్కన వెళ్ళే దారిలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ లెవెన్ కె.వి 25 కేవి ట్రాన్స్ఫార్మర్ స్తంభం తో సహా కిందికి వంగి పోవడం వలన వ్యవసాయ పనులకు వెళుతున్న వ్యవసాయ దారుని ఎద్దు మూగజీవి విద్యుత్ షాక్ తలిగి అక్కడికక్కడే ఎద్దు చనిపోవడం జరిగింది.

విద్యుత్ అధికారులకు గతంలో పలుమార్లు సమాచారం ఇచ్చిన ఇట్టి విద్యుత్ స్తంభం ట్రాన్స్ఫార్మర్ను సరి చేయమని చెప్పగా పట్టించుకోకపోవడం వల్లనే మూగజీవి ఎద్దు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే అధికారుల కు ఎన్ని సార్లు చెప్పినా కూడా పట్టించుకోకపోవడం వలన ఈరోజు మూగజీవి చనిపోవడం జరిగింది. ట్రాన్స్ఫార్మర్ చుట్టూ గడ్డితీగలతో చుట్టుకొని అలలు అల్లి కింది నుండి పై స్థాయి లైన్ వరకు మొత్తం గడ్డి తిగతో అల్లుకు పోవడం జరిగింది. ఇట్టి విషయమై విద్యుత్ అధికారి లైన్మెన్ శేఖర్ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని గ్రామ ప్రజలు వ్యవసాయదారులు అన్నారు. ఇట్టి విషయమై లైన్మెన్ శేఖర్ ను వివరణ కోరగా నాకు ఎలాంటి సంబంధం లేదు అని మా పై అధికారులు వచ్చి ఇట్టి విషయాన్ని పంచనామా చేసి క్లైమ్ చేపిస్తామని నామమాత్రంగా చేతులు దులుపుకొని అక్కడి నుంచి వెళ్లిపోవడం జరిగింది.

ఇంత జరిగినా కూడా విద్యుత్ అధికారులు నమ మాత్రం గా వచ్చి మాకు ఎలాంటి సంబంధం లేదని చూసి చూడనట్టుగా వచ్చి వెళ్లిపోవడం జరిగింది. దయచేసి నాకు న్యాయం చేసి విద్యుత్ అధికారులకు పై తగు చర్య తీసుకొని నన్ను ఆదుకోవాలని ఎద్దు యజమాని అన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india