*కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం*కామారెడ్డి పట్టణంలో అర్ధ రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
కామారెడ్డి పట్టణంలో ఉన్న అయ్యప్ప షాపింగ్ మాల్‌లో ఈ ఘటన జరిగింది. అర్ధ రాత్రి 12:00గంటల ప్రాం తంలో ఒక్కసారిగా మాల్‌లో మంటలు చెలరే గాయి.
క్రమంగా షాపింగ్ మాల్ నాలుగంతస్తులకు ఈమం టలు వ్యాపించాయి.మంట ల్లో షాపింగ్ మాల్‌లోని సామగ్రి కాలి బూడిదైనట్లు తెలిసింది.
స్థానికుల సమచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘట నాస్థలికి చేరుకుంది.రాత్రి నుంచి ఇవాళ ఉదయం 7 గంటల వరకు రెండు అంతస్తుల్లో మంటలు అదుపులోకి తీసుకు వచ్చారు.
మిగిలిన రెండు అంతస్తుల్లో మంటలు ఇంకా అదుపు లోకి రాలేదు. జేసీపీ సాయంతో షాపింగ్ మాల్ షట్టర్లను తొలగించి మంట లను ఆర్పేందుకు యత్ని స్తున్నారు.
అగ్నికీలలు భారీగా ఎగసి పడుతుండటంతో పరిసర ప్రాంతాల ప్రజలు భయాం దోళనకు గురవు తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ఆ ప్రాంతంలో రహదా రులను బ్లాక్ చేశారు. పరిసరాల దుకాణాల యజ మానులను, ప్రజలను అప్ర మత్తం చేశారు. ప్రమాదంలో ఆస్తి నష్టం రూ.కోట్లలో ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ ప్రమాదం ఎలా సంభ వించిందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు…
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








