మందర్న నుంచి ప్రతిరోజు భారీగా ఇసుక తరలింపు
పది నుంచి భారీ వాహనాలలో, లారీలలో, హైదరాబాద్ పట్టణంతోపాటు వివిధ పట్టణాలు వివిధ చోట్లకి భారీగా ఇసుక తరలింపు
గత ఆరు నెలల నుంచి భారీగా ఇసుక తరలింపు
బోధన్ తోపాటు మందర్న గ్రామంలోని కొంతమంది ఇసుక డంప్ చేస్తూ, హైదరాబాద్ పట్టణంతోపాటు పలుచోట్లకి ఇసుక తరలింపు
తహసీల్దార్ నుంచి బోధన్ ఆర్డిఓ నుంచి జిల్లా కలెక్టర్ కు చెప్పిన పట్టించుకోని వైనం
అంటున్న స్థానిక ప్రజలు
[contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form]

బోధన్
నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం సాలూర మండలం మందర్నా గ్రామం నుంచి
ప్రతిరోజు రాత్రిపూట ఇసుక ప్రతిరోజు హైదరాబాద్ పట్టణంతోపాటు ఇతర పట్టణాలకు ఇతర చోట్లకి కొంతమంది బోధన్ పట్టణంతోపాటు మందర్న గ్రామంతో పాటు పలుచోట్ల ఉన్న ఇసుక మాఫియాదారులు భారీగా తరలిస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారని వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాలుర మండలంలోని మందర్నా గ్రామం తో పాటు చుట్టుపక్క మంజీరా సరిహద్దు ప్రాంతం నుంచి ప్రతిరోజు ఇసుక ప్రత్యేక వాహనాలలో భారీగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. మందర్న గ్రామం లోని మంజీరా సరిహద్దు ప్రాంతం నుంచి, గత ఆరు నెలల నుంచి రాత్రిపూట గ్రామంలోని కొంతమంది బోధన్ పటానికి చెందిన కొంతమంది ఇసుక మాఫియా దార్లు ప్రత్యేక స్థలాల వద్ద డంపు చేసి వాటిని లారీలలో ఇసుక నింపి హైదరాబాద్ పట్టణంతో పాటు ఇతర పట్టణాలకు ఇసుక అవసరం ఉన్నవారికి అధిక ధరలకు విక్రయిస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారని, గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆరు నెలల నుంచి ఈ ఇసుక మాఫియా జోరుగా కొనసాగుతుందని, దీనికి సంబంధించి ఫిర్యాదు మండల ఎంఆర్ఓ నుంచి బోధన్ ఆర్డిఓ తో పాటు జిల్లా కలెక్టర్ లకు ఇచ్చిన పట్టించుకోవడంలేదని ఇటువైపు కన్నెత్తి చూడడం లేదని వారిచ్చే మాముళ్ళ మత్తులో మనుగుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇసుక మాఫియా దారులు ఏ రాజకీయం ఉంటే ఆ రాజకీయ అండదండలతో ఈ ఇసుక మాఫియా జోరుగా కొనసాగిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మంజీరా నదిలో 20 ఫీట్ల కంటే అధిక లోతులో జెసిబిల ద్వారా త్రవ్వకాలు చేస్తూ వాటిని ప్రత్యేక స్థావరం వద్ద డంపు చేసి పెద్ద పెద్ద లారీలలో ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ప్రజలు మండిపడుతున్నారు. అత్యధిక లోతులో మంజీరా నదులలో త్రవ్వకాలు చేయటం వల్ల మహారాష్ట్రకు వెళ్లవలసిన నీరు గ్రామంలోకి వచ్చే పరిస్థితులు నెలకొంటున్నాయని, గ్రామంలో ఇంత పెద్ద పరిస్థితులు ఉన్నప్పటికీ ఇటువైపు అధికారులు కన్నెత్తి చూడడం లేదని, ఇసుక మాఫియాదారులు ఇచ్చే మాముల మత్తులో మునుతున్నారని ప్రజలు మండిపడుతున్నారు. గత ఆరు నెలల నుంచి జోరుగా కొనసాగుతున్న ఇస్కామాఫియా పై సంబంధిత శాఖ అధికారులు దృష్టి సారించాలని, ఇసుక తరలింపు వెంటనే ఆపాలని, వాల్టా చట్టాన్ని కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








