V1News Telangana

best news portal development company in india

ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి మొదటి సారి రామగుండం ప్రాంతానికి వచ్చిన రాజ్ ఠాకూర్ కు ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు

SHARE:

నా చివరి శ్వాస వరకు రామగుండం ప్రాంత ప్రజలకు అండగా ఉంటా -ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి మొదటి సారి రామగుండం ప్రాంతానికి వచ్చిన రాజ్ ఠాకూర్ కు ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం డిసెంబర్ 10:-

గోదావరిఖని-: రామగుండం ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిపించిన రామగుండం నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ శనివారం అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి ఆదివారం మొదటి సారి రామగుండం ప్రాంతానికి వచ్చిన రాజ్ ఠాకూర్ కి బసంత్ నగర్ వద్ద పాలకుర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, బుగ్గ రోడ్డు వద్ద అంతర్గాం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, బి పవర్ హౌజ్ గడ్డ వద్ద రామగుండం కార్పోరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, ఎన్.టి.పి.సి లో, గోదావరిఖనిలో పెద్ద ఎత్తున రాజ్ ఠాకూర్ కి ఘన స్వాగతం పలికారు.. బి పవర్ హౌజ్ నుండి గోదావరిఖని వరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ ఎత్తున బైక్ ర్యాలీ తీసారు. గోదావరిఖని మెయిన్ చౌరస్తాలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూల మాల వేసి నివాళ్లు అర్పించారు.ఈ సందర్బంగా రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ… రామగుండం నియోజకవర్గం ప్రజలు నాపై నమ్మకంతో నన్ను అధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించడం జరిగిందాని, నా చివరి శ్వాస వరకు ఈ ప్రాంత అభివృద్ది కోసం పని చేస్తానని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ప్రతి సమస్యపై పోరాటం చేసి సమస్యలను పరిష్కరిస్తానని, రామగుండం ప్రాంతానికి పూర్వ వైభవం తీసుకువస్తానని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని, అధికారంలోకి వచ్చిన 3రోజుల్లోనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, 10లక్షల వరకు ఆరోగ్య శ్రీ ఉచిత వైద్యం పథకలను అమలు చేయడం జరిగిందాని పేర్కొన్నారు.. నా గెలుపు కోసం సైనికుడిల పని చేసిన నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు, తదితరులకు ధన్యవాదాలు తెలిపారు.. పెద్ద ఎత్తున ప్రజలు రాజ్ ఠాకూర్ నీ శాలువాలతో పూల మాలలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్పోరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు, ప్రజలు తదితరులు భారీ సంఖ్యలో పాల్గోన్నారు.

Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

best news portal development company in india