V1News Telangana

best news portal development company in india

బోధన్ లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీలో సీనియర్లమంటూ వారిదే పై చేయి వారు చెప్పిన వారికే డబుల్ బెడ్రూంలు, ప్రభుత్వ ఇండ్ల స్థలాలు వారు చెప్పిందే వేదం వినని వారిపై వేటు

SHARE:

బోధన్, పెగడపల్లి విలేకరులకు ఇచ్చిన ప్లాట్లు, డబుల్ బెడ్ రూమ్లలో లొల్లి
గతంలో లబ్ధి పొందిన విలేకరులు, స్థానికులు కాని వారికి ప్లాట్లు డబుల్ బెడ్ రూమ్ ఎట్లా ఇస్తారని ఆరోపణలు
స్థానికంగా లేనివారు అర్హులు కాని వారు ఆధార్ కార్డు లేని వారికి డబుల్ బెడ్ రూమ్ ఎట్ల ఇస్తారని ఆరోపణలు
ఎంపీటీసీ కూడా నాకు కావాలంటూ మిగతా విలేకరు కూడా మాకు ఎట్లా ఇవ్వరు అంటూ
మేము సైతం ప్లాట్లు వేసుకుంటామని బయలుదేరుతున్నట్టు సమాచారం
22 మందికే డబుల్ బెడ్ రూమ్ బిల్లులు ఇచ్చామని మిగతా వారికి బిల్లులు ఇవ్వలేమని ప్లాట్లతో మాకు సంబంధం లేదని హౌసింగ్ శాఖ అధికారి తెలిపారు.
ఇండ్లు కట్టిన వారికే బిల్లులు ఇచ్చాం మిగతా వారికి ఇవ్వలే
బిపిఎల్ కోటలో స్థానికంగా ఉన్నవారికి ఇచ్చారా
దీని మీద ఎలక్షన్లు ఉన్నాయి ఇవి కాగానే తప్పకుండా ఎంక్వైరీ చేస్తాం ఎమ్మార్వో గంగాధర్…


బోధన్
బోధన్ మండలం పెగడపల్లి గ్రామ శివారు ప్రాంతంలో సుమారు 80 మంది విలేకరులకు డబుల్ బెడ్ రూమ్ పంపిణీ చేశారు అనేది ప్రధాన ఆరోపణ, ఈ 80 మందిలో విలేకరులు స్థానికులు కాని వారు ఉన్నారని ఇక్కడ రేషన్ కార్డులు ఆధార్ కార్డులు లేని వారు ఉన్నారని బిపిఎల్ కోటలో స్థానికంగా ఆధార్ కార్డు లేని వారికి ఏ విధంగా ఇచ్చారని పలువురు మంది పడుతున్నారు. గతంలో లబ్ధి పొందిన విలేకరులకే మళ్లీ మళ్లీ ఏ విధంగా ప్లాట్లు డబల్ బెడ్ రూమ్ లు ఇస్తారని ప్రజలు విమర్శలు చేస్తున్నారు. కానీ విలేకరులకు కూడా స్థానికంగా లేని వారు విలేకరులు కూడా అక్కడ డబుల్ బెడ్ రూమ్ లు కానీ ప్లాట్లు కాని ఏ విధంగా ఇస్తారని పలువురు విమర్శలు చేస్తూ ప్రశ్న చేస్తున్నారు. ఈ సందర్భంగా హౌసింగ్ శాఖ ఏఈ నాగేశ్వరరావును వివరణ కోరగా కేవలం 22 మందికే హౌసింగ్ బిల్లులు ఒక్కొక్క బిల్లు ఇచ్చామని మిగతా వారికి ఇవ్వలేదని దీనిపై సమగ్ర సమాచారం తహసిల్దార్ గంగాధర్ను అడిగి తెలుసుకోవాలని వివరణ ఇచ్చారు. ఎమ్మార్వో బోధన్ కు చరవాణి ద్వారా ఫోన్లో వివరణ కోరగా ఎవరైతే ఇల్లు కట్టారో వారికే డబుల్ బెడ్ రూమ్ బిల్లులు ఇచ్చామని మిగతా వారికి ఇవ్వలేదని చెప్పారు. బిపిఎల్ కోటలో అర్హులు కాని వారికి అదేవిధంగా స్థానికంగా లేనివారికి ఇచ్చారని ఆరోపణ ఉందని ప్రశ్నాడగా ఎలక్షన్లు ఉన్నాయని ఇవి కాగానే ఎంక్వయిరీ చేస్తామని ఎమ్మార్వో గంగాధర్ సమాధానం చరవన్లో ఇచ్చారు. అదే ప్లాట్ల లో ఒక గ్రామానికి చెందిన ఒక ఎంపీటీసీ కూడా నాకు కావాలంటూ ప్లాట్లు, అదేవిధంగా మరికొంత విలేఖలు కూడా మాకు అన్యాయం జరిగిందని మాకు ప్లాట్లు ఇవ్వాలంటూ వారు కూడా ప్లాట్లు వేస్తామని జగడాకు, రగడకు దిగుతున్నట్టు సమాచారం. కొంతమంది విలేకరులు వారికి సంబంధించిన కుటుంబీకులకు వారికి సంబంధించిన దోస్తులు విలేకరులు కాకుండా అర్హులు కాకుండా ప్లాట్లు ఇచ్చి మిగతా విలేకరులు అర్హులై ఉన్నప్పటికీ వారిపై వివక్ష చూపారు అనేది ప్రధాన ఆరోపణ. సుమారు 70 నుంచి 80 మంది విలేకరులకు ప్లాట్లు ఇచ్చినప్పుడు వారు అర్హుల అనర్హుల అనేది అధికారులు పాలకులు ఎంక్వయిరీ చేశారా చేయకుండా ఎలా ఇచ్చారు అనేది ప్రధాన విమర్శ,. పట్టణంలో ఎంతో మంది నిరుపేదలు డబుల్ బెడ్ రూమ్లు, ప్లాట్లు లేక అవస్థలు ఎదుర్కొంటున్నారని అలాంటి వారికి ఇవ్వకుండా అన్హర్వులుగా ఉన్నవారికి ఏ విధంగా ఇస్తారని ప్రజలు విమర్శలు చేస్తున్నారు.

బోధన్ లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీలో సీనియర్లమంటూ వారిదే పై చేయి
వారు చెప్పిన వారికే డబుల్ బెడ్రూంలు, ప్రభుత్వ ఇండ్ల స్థలాలు
వారు చెప్పిందే వేదం వినని వారిపై వేటు
కోటగిరిలో డబుల్ బెడ్రూం బిల్లులు తీసుకొని ఇండ్ల స్థలాలు తీసుకొని డబుల్ బెడ్ రూమ్ బిల్లులు లేపి ఇండ్లు కట్టి వాటిని అమ్మేసిన వారికి మళ్ళీ బోధన్ లో డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వడం ఎంతవరకు న్యాయం
రుద్రూర్లో డబుల్ బెడ్ రూములు బోధనలో మళ్ళీ డబుల్ బెడ్ రూమ్ లా
మాజీ ప్రజా ప్రతినిధి కూడా విలేకరుల ఇళ్లస్థలాల వద్ద డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ,అక్కడ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు పనులు ప్రారంభించడమా
సీనియర్ అంటూ అంతా నాదే అంటూ ఆయనకు వత్తాసు పలికి ఆయన ఇంటి నిర్మాణానికి విలేఖరి కాకుండా ఆయనకు సహకరించడం ఏమిటని పలు మంది విలేకరుల ప్రశ్నలు, ఆరోపణలు

బోధన్ మండలం ఆచంపల్లి పెగడపల్లి సరిహద్దు ప్రాంతంలో సీనియర్ విలేకరి అంటూ అంతా నా ఇష్టం అని ఓ విలేఖరి ఓ మాజీ ప్రతినిధి విలేకరి కాకున్నా ఆయనకు ఇండ్ల స్థలం ఇచ్చామంటూ అంతా నాదే నేను చెప్పిందే వేదం అన్న చందంగా ఆయన ఇంటి స్థలం కేటాయించి ఆయన ఇంటి నిర్మాణ పనులకు సహకరించడం ప్రస్తుతం ఇంటి నిర్మాణ పనులు కొనసాగించడం ఎంతవరకు సమంజసం అని పలువురు విలేకరులు ప్రజలు ప్రశ్నించుకుంటున్నారు. రుద్రూర్ మండలంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించుకున్న వారికి బోధన్ లో డబుల్ బెడ్ రూమ్ ఇవ్వడమేమిటని ప్రశ్నించుకుంటున్నారు. పెద్ద మనుషులుగా సీనియర్ విలేకరిగా చలామణి అయ్యేవారు
చాలామంది అర్హులైన విలేకరులకు ఇండ్ల స్థలాలు ఇవ్వకుండా, అంతా నా ఇష్టం అన్న చందంగా వ్యవహరిస్తున్న వారు కొంతమంది విలేకరుల పట్ల వివక్ష చూపుతున్నారని వారి మాటలే అధికారులు ,పాలకులు వినడం సిగ్గుచేటని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోటగిరి మండల కేంద్రంలో డబుల్ బెడ్ రూమ్ బిల్లులు పొంది డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, ప్రభుత్వ స్థలం పొంది, అలాంటి విలేకరులకు మళ్ళీ బోధన్ లో డబుల్ బెడ్ రూమ్ వాటితో పాటు బిల్లులు ఎలా ఇస్తున్నారని అంటే వారి కుటుంబ సభ్యుల పేరుతో కాకుండా ఇంకొక వేరే పేర్లు పెట్టి కుటుంబ సభ్యులలోనే వేరే పేర్లు పెట్టి బిల్లులు లేపుకుంటున్నారని విలేకరులు, ప్రజలు ఆరోపిస్తున్నారు. వీటిపై ఎలాంటి ఎంక్వయిరీ హౌసింగ్ శాఖ ,రెవెన్యూ శాఖ చేయకుండానే ఇవ్వడం చాలా దారుణం అని ప్రజలు మండిపడుతున్నారు. అర్హులైన నిరుపేదలకు దక్కాల్సిన డబ్బులు బెడ్రూంలు ప్రభుత్వ స్థలాలు, స్థానికులు కాని వారికి ఇంతకుముందు ఇళ్ల స్థలాలు పొంది ఇల్లు కట్టుకున్న వారికి ప్రభుత్వ భూములు పొంది ప్రభుత్వ భూములు అమ్మివేసిన వారికి కోటీశ్వరులు, ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్న వారికే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ప్రభుత్వ స్థలాలు ఎలా ఇస్తారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తూ పలు విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికైనా ఇలాంటి వారి పై ఎంక్వయిరీ చేసి అర్హులైన విలేకరులకు అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ప్రభుత్వ స్థలాలు ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.

ఈనాడు పత్రిక విలేఖరి నగేష్ కు డబుల్ బెడ్ రూమ్ ప్రభుత్వ స్థలం ఎలా ఇచ్చారు వెంటనే తొలగించండి
రుద్రూర్ చౌరస్తా ప్రాంగణంలో నిరసన రుద్రూర్ తాసిల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు

నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండల కేంద్రంలో ఈనాడు విలేఖరి నగేష్ కు ఏ విధంగా డబుల్ బెడ్ రూమ్ ప్రభుత్వ స్థలం ఇచ్చారని అశోక్ అనే విలేఖరి రుద్రూరు చౌరస్తా ప్రాంగణంలో నిరసన చేసి తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈనాడు యాజమాన్యం కూడా వాస్తవాలు పేదల పక్షాన వార్తలు రాసేటప్పుడు అందులో పని చేసే ఓ విలేఖరి సీనియర్ నంటూ ఈనాడు రుద్రూర్ విలేఖరి నగేష్ కు ఇష్టానుసారంగా అక్రమంగా ప్రభుత్వ స్థలం, డబుల్ బెడ్ రూమ్ పొందినప్పుడు ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఈనాడు యాజమాన్యానికి పత్రిక పరంగా ప్రశ్నించడం జరిగింది. ఆయనతోపాటు ఇంకొంతమంది అనారులుగా ఉన్న వారికి ప్రభుత్వ స్థలం ఇవ్వడం జరిగిందని వాటిని ఎంక్వయిరీ చేసి తొలగించాలని కోరడం జరిగింది. నగేష్ రుద్రూర్ మండల కేంద్రానికి చెందినవారు కాదని ఇక్కడ ఆధార్ కార్డులు రేషన్ కార్డులు, ఓటింగ్ కార్డు లేదని, సదురు విలేఖరి ఎడపల్లి మండల కేంద్రానికి చెందిన వారని ఆయనకు భూములు వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయని, హౌసింగ్ శాఖ ఏఈ నాగేశ్వరరావు ఎలాంటి ఎంక్వయిరీ చేయకుండా బిపిఎల్ కోటాలో అన్హార్లుగా ఉన్న నగేష్ కు ఏ విధంగా డబుల్ బెడ్ రూమ్ బిల్లులు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. అదేవిధంగా ఎలాంటి ఎంక్వయిరీ చేయకుండా అనరులుగా ఉన్న నగేష్ కు ప్రభుత్వ స్థలం డబుల్ బెడ్ రూమ్ కేటాయించడంలో కృషిచేసిన ఎమ్మార్వో ,రెవెన్యూ సిబ్బందిపై కూడా చర్యలు తీసుకోవాలని, హౌసింగ్ శాఖ ఏఈ నాగేశ్వరరావు ఎమ్మార్వో రెవెన్యూ సిబ్బంది పై క్రిమినల్ కేసులు బుక్ చేయాలని అలాంటి అధికారులు వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఓ పిఎంపి డాక్టర్ గా చెలమని అయ్యే వ్యక్తికి ప్రభుత్వ స్థలం ఎలా ఇచ్చారని ఆ స్థలంలో ఆయన ఇల్లు ఎలా కట్టుకుంటారని ఆయనతోపాటు అనారులుగా ఉన్న వారికి ఏ విధంగా ప్రభుత్వ స్థలం ఎలా కేటాయిస్తారని ఆయన ప్రశ్నించారు. సదురు పి.ఎం.పి డాక్టర్కు ఆయన సొంత గ్రామంలో ఆస్తులు, ఇల్లు ఉన్నాయని అలాంటప్పుడు ఎంక్వయిరీ చేయకుండా ప్రభుత్వ స్థలం ఎలా కేటాయించారని నిరుపేదలకు స్థానికంగా ఉన్నవారికి ఇవ్వాలి కదా అని పలువురు ప్రశ్నించుకుంటున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india