V1News Telangana

best news portal development company in india

ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటా…! – ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్

SHARE:

ముధోల్,డిసెంబర్ 05(వి1 న్యూస్ తెలుగు): ప్రజా సమస్యల పరిష్కారం కోసం తాను ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ,ప్రజా దర్బార్ నిర్వహిస్తానని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు,

మంగళవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రజా సమస్యల కోసం నిరంతరం పాటు పడతానన్నారు,ఇచ్చిన మాట ప్రకారం ముధోల్ నియోజకవర్గం అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని చెప్పారు,తన గెలుపులో సహకరించిన ప్రజలకు కార్యకర్తలకు,నాయకులకు, బీజేపీ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు,అసత్య పుకార్లను ప్రజలు నమ్మవద్దని,తాను చివరి శ్వాస వరకు బీజేపీ పార్టీలోనే కొనసాగుతానని చెప్పారు,అభివృద్ధిలో భాగంగా విద్య,ఆరోగ్యం,వ్యవసాయం నీటిపారుదల రంగాలకు ప్రముఖ ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు వెల్లడించారు, ప్రజా సమస్యల పరిష్కారానికి దళారి వ్యవస్థకు స్థానం లేదని, నేరుగా తనను ప్రజలు సంప్రదించవచ్చు అన్నారు, అన్ని వర్గాలను సమాన దృష్టితో చూస్తానని అన్నారు, దేశాన్ని వ్యతిరేకించే ఎవరినైనా ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నియోజకవర్గాన్ని గణనీయమైన అభివృద్ధి చేస్తానన్నారు…

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india