ముధోల్ గడ్డపై ఎగిరిన కాషాయ జెండా…
*- భారీ మెజారిటీతో బిజెపి గెలుపు*
ముధోల్,డిసెంబర్ 03( ): ముధోల్ గడ్డ పై మొదటిసారి కాషాయ జెండా ఎగిరింది,బీజేపీ అభ్యర్థి పవార్ రామారావు పటేల్ బీఆర్ఎస్ ప్రత్యర్థి విఠ్ఠల్ రెడ్డి పై భారీ మెజారిటీతో గెలుపొందారు, గత నెల 30వ తేదీన తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరగగా ఆదివారం రోజున ఎన్నికల ఓట్ల లెక్కింపును నిర్మల్ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించారు,
మొదటి రౌండ్ నుండి బీజేపీ అభ్యర్థి పవార్ రామారావు పటేల్ ప్రత్యర్థి అయిన విఠ్ఠల్ రెడ్డి పై ఆదిపత్యం చెలాయిస్తూ చివరి రౌండ్ వరకు ఆ ఆదిత్యాన్ని కొనసాగించారు,
హైట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుందామని ఆశపడ్డ విఠ్ఠల్ రెడ్డికి రామారావు పటేల్ భారీ షాక్ ఇచ్చారు,మూడవసారి ముచ్చటగా గెలుపొంది ముధోల్ గడ్డను వేలాలనుకున్న ఎమ్మెల్యే ఆశలపై ఆవిరి చల్లుతూ 23 వేల పైచిలుకు మెజారిటీతో రామారావు పటేల్ గెలుపొందారు,తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన విఠ్ఠల్ రెడ్డి కి వ్యతిరేక పవనాలు గట్టిగా వీచాయి,దీంతో బిజెపికి వన్ సైడ్ ఓట్లు రాగా కమలం పువ్వుకు ప్రజలు పట్టం కట్టారు,మైనారిటీ ఓట్లను నమ్ముకుని బరిలోకి దిగిన కాంగ్రెస్ నేత నారాయణ రావు పటేల్ ఈ దశలోను పోటీకి ఢీకొట్టలేదు,కాంగ్రెస్ పార్టీకి మైనారిటీ ఓట్లు పడతాయని అనుకున్నప్పటికీ ,మైనారిటీ ఓట్లు దాదాపు బీఆర్ఎస్ కు పడ్డట్లు తెలుస్తోంది,
కష్టకాలంలో ప్రజలకు ఆయన వెన్నంటి ఉండటం,రెండుసార్లు ఓడిపోవడం అనే సానుభూతి కలిసి రావడంతో ఓట్లు బీజేపీకి పడినట్లు తెలుస్తోంది,దీంతో రామారావు పటేల్ ప్రత్యర్థి విఠ్ఠల్ రెడ్డి పై భారీ మెజారిటీతో దిగ్విజయం సాధించారు.
*అంబరాన్నంటిన సంబరాలు…*
ఆదివారం నిర్వహించిన శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో 23 రౌండ్ల ఓట్లు లెక్కించగా బీజేపీ అభ్యర్థి పవార్ రామారావు పటేల్ సగం రౌండ్ ముగిసే సరికి విజయ డంక మోగిస్తున్నారన్న సమాచారంతో బీజేపీ కార్యకర్తలు,నాయకులు, రామారావు పటేల్ అభిమానులు పెద్ద ఎత్తున ఓట్ల లెక్కింపు కార్య స్థలానికి చేరుకొని సంబరాలు నిర్వహించారు,కౌంటింగ్ పూర్తయిన వెంటనే ఎన్నికల కౌంటింగ్ కేంద్రం నుండి బయటకు వచ్చిన పవార్ రామారావు పటేల్ కి బీజేపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు,శాలువాలతో సత్కరించారు,బీజేపీ శ్రేణులకు పవార్ రామారావు పటేల్ ప్రతి ఒక్క కార్యకర్తకు అభివాదం తెలుపుతూ సంతోషం వ్యక్తం చేశారు…
*నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటా…*
ప్రజలు ఇచ్చిన భారీ మెజారిటీ ఎప్పటికీ మర్చిపోలేనని పవార్ రామారావు పటేల్ అన్నారు,
23వేల మెజారిటీతో గెలుస్తానని అనుకోలేదని, ఇంత మెజారిటీ రావడానికి అభిమానుల,బిజెపి శ్రేణులు కష్టం మరువలేనిదని అన్నారు,
తన విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు,కృతజ్ఞతలు తెలిపారు,తనపై నమ్మకం ఉంచి ఇంతటి మెజారిటీ ఇచ్చిన నియోజకవర్గ ప్రజలకు న్యాయం చేస్తానని,అభివృద్ధికి కృషి చేస్తానని,సమస్యలను వెంటనే పరిష్కారం చేస్తామని తెలిపారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








