V1News Telangana

best news portal development company in india

ఓటరు గుర్తింపు కార్డు (ఎపిక్ కార్డు) లేకుంటే 12 రకాల ప్రత్యామ్నాయ ఫోటో గుర్తింపు ద్వారా ఓటు వేయవచ్చు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్

SHARE:

ఓటరు గుర్తింపు కార్డు (ఎపిక్ కార్డు) లేకుంటే 12 రకాల ప్రత్యామ్నాయ ఫోటో గుర్తింపు ద్వారా ఓటు వేయవచ్చు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది పెద్దపల్లి, నవంబర్ -28:-ఓటరు గుర్తింపు కార్డు (ఎపిక్ కార్డు) లేకుంటే 12 రకాల ప్రత్యామ్నాయ ఫోటో గుర్తింపు కార్డులలో ఏదో ఒకదానిని చూపెట్టి తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఎలక్షన్ కమీషన్ కల్పించిందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఎపిక్ కార్డు లేని వాళ్లు ఆధార్ కార్డు, ఎం.జి.ఎన్.ఆర్.ఇ.జి.ఎ. జాబ్ కార్డు, బ్యాంకు, పోస్ట్ ఆఫీస్ వారిచే జారీ చేసిన పాస్ పుస్తకాలు, కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆరోగ్య భీమా స్మార్ట్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, ఎన్.పి.ఆర్. కింద ఆర్.జి.ఐ. జారీ చేసిన స్మార్ట్ కార్డు, పాస్ పోర్ట్, ఫోటో తో కూడిన పెన్షన్ డాక్యుమెంట్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పి.ఎస్. యు.లు, పబ్లిక్ లిమిటెడ్ సంస్థల ఉద్యోగులకు ఫోటోతో జారీ చేసిన ఐడి కార్డు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు జారీ చేసిన ఐడి కార్డు, ప్రత్యేక వైకల్యం ఐడి కార్డు (యు.డి ఐ.డి.) లలో ఏదో ఒకదానితో ఓటు వేయవచ్చని తెలిపారు.  అర్హులైన ఓటర్ లు తమ ఓటు హక్కును ఎన్ని పనులు ఉన్నా పోలింగ్ రోజు నవంబర్ 30న సమయం కేటాయించి తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించు కోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఆ ప్రకటనలో తెలిపారు.

Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

best news portal development company in india