V1News Telangana

best news portal development company in india

తీవ్ర అస్వస్థకు గురై పడిపోయిన బిజెపి అభ్యర్థి కందుల సంధ్యారాణి

SHARE:

తీవ్ర అస్వస్థకు గురై పడిపోయిన బిజెపి అభ్యర్థి కందుల సంధ్యారాణి

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం నవంబర్ 28:-

30 రోజుల ఎన్నికల ప్రచారంలో పార్టీ గెలుపు కోసం నిరంతరం ప్రజల్లో ఉంటూ.. రామగుండం అడబిడ్డగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న కందుల సంధ్యారాణి ఒక్క సరిగా అనారోగ్యానికి గురి కావడంతో అందరిలోను ఆందోళన నెలకొంది. ఇప్పటికే మహిళల్లో తనకంటూ ఒక్క ప్రత్యేకతను చోటు చేసుకొని అందరికి అండగా నేనున్నానంటూ భరోసా కల్పించే క్రమంలో సంధ్యారాణి అనారోగ్యానికి గురైయ్యారు.గత నెల రోజులుగా బిజెపి పార్టీ నుండి రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కందుల సంధ్యారాణి ప్రజల్లోకి వెళ్తూ తనదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తు ప్రజల మన్ననలు పొందారు. అయితే రోజులాగే సోమవారం ఎన్నికల ప్రచారం చివరి రోజు కావడంతో గోదావరిఖని, కళ్యాణ్ నగర్ లక్ష్మినగర్ లలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన అనంతరం ఒక్క సరిగా బీపీ. షుగర్ లెవల్స్ తగ్గడంతో కళ్లు తిరిగి కింద పడి పోవడంతో వెంటనే పార్టీ నాయకులు, కార్యకర్తలు హుటాహుటిన కళ్యాణ్ నగర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.

Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

best news portal development company in india