V1News Telangana

best news portal development company in india

*తానూర్ లో ప్రారంభమైన విఠలారుక్మాయి జాతర ఉత్సవం వేడుకలు…!* ➡️ *- ఆదివారం సాయంత్రం కన్నుల పండుగ రథోత్సవం..* ➡️ *- సోమవారం జాతర,మల్లా యోదులకు కుస్తీ పోటీలు..*

SHARE:

తానూర్,నవంబర్ 25(వి1 న్యూస్ తెలుగు): నిర్మల్ జిల్లా మండల కేంద్రమైన తానూర్ లోని విఠలారుక్మాయి జాతర ఉత్సవం వేడుకులు వైభవోపేతంగా ప్రారంభమైయ్యాయి.

,కార్తీక మాసం సందర్భంగా ప్రతి యేట లాగే ఈఏడు కూడ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రధాన ఆలయాలను విద్యుత్ దీపాలతో ప్రత్యేక ముస్తాబు చేశారు,విఠలేశ్వర ఆలయంలో కోనసాగుతున్న అఖండ హరీనామ సప్తాహం శనివారం నాటికి ఆరోవ రోజుకు చేరుకుంది,కార్తీక పౌర్ణమీ సందర్భంగా ప్రతి రోజు కాకాడ హారతి తో పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు,

ఆదివారం సాయంత్రం రథోత్సవం వేడుకలను కన్నుల పండువుగా నిర్వహించనున్నారు,
ఈ రథోత్సం ఊరేగింపు తీలకించటాని పరిసార ప్రాంతాల నుంచి ప్రజలు,భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి పాల్గోంటారు,విఠలారుక్మాయి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు,రథోత్సవం శోభ ర్యాలీ గ్రామంలోని ప్రధాన వీధుల గుండ కన్నుల పండువుగా సాగుతోంది,భక్తులు,మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ముడుపులు కట్టి మొక్కులు తీర్చుకుంటారు,

*- జాతర కు ఏర్పాట్లు పూర్తి…*

ప్రతి సంవత్సరం లాగే కార్తీక పౌర్ణమీను పురస్కరించుకుని
విఠలారుక్మాయి జాతర కోసం ఆలయ కమిటి,గ్రామ విడిసి కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లను ఏర్పాటు చేసినట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు పంగి పండరి తెలిపారు,సోమవారం ఉదయం విఠలారుక్మాయి ఆలయంలో హారతి నిర్వహించి జాతర ఉత్సవాలను ప్రారంభించానున్నట్లు తెలిపారు,

*- మల్లాయోదులకు కూస్తీల పోటీలు..*

ప్రతి సంవత్సరం లాగే ఈ యేడు కూడా మల్లా యోదులకు నిర్వహించే కూస్తీల పోటీల కోసం జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో కుస్తీల నిర్వహణ కోసం ప్రత్యేక ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ,విడిసి కమిటీ సభ్యులు తెలిపారు,ప్రథమ బహుమతిగా రూ,11,111రూపాయాలు,ఓ వెండి కడియం,
ద్వితీయ బహుమతి గా రూ,8851రూ,లు నగదును అందించనున్నారు,ఈ కూస్తీల పోటీల్లో తలపడి గేలుపోందిన ప్రతి మల్లాయోదునికి బహుమతులను ప్రధానం చేస్తారు…

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india