V1News Telangana

best news portal development company in india

ముధోల్ తాలూకాను దత్తత తీసుకుంటా* *కేంద్రం నిధులతో అభివృద్ధి చేస్తా* *బిసి ముఖ్యమంత్రి ప్రకటించిన ఘనత బిజెపిది* *ఎస్సీల వర్గీకరణక బిజెపితోనే సాధ్యం* *బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్*

SHARE:

*ముధోల్ తాలూకాను దత్తత తీసుకుంటా*

*కేంద్రం నిధులతో అభివృద్ధి చేస్తా*

*బిసి ముఖ్యమంత్రి ప్రకటించిన ఘనత బిజెపిది*

*ఎస్సీల వర్గీకరణక బిజెపితోనే సాధ్యం*

*బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్*

*ముధోల్, నవంబర్ 18(వి1 న్యూస్ తెలుగు): ముధోల్ తాలూకాను దత్తత తీసుకొని కేంద్ర నిధులతో అభివృద్ధి సైతం చేస్తానని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ అన్నారు….

,శనివారం బైంసా పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు మహిషా అంటేనే ఏదో కొత్త జోష్ వస్తుందని,ఇక్కడి బీజేపీ అభ్యర్థి రామారావు పటేల్ ఇప్పటికీ నవ యువకుడిలా పోరాడుతున్నారని అన్నారు,ఎంతో మంది బలి త్యాగాల వల్ల తెలంగాణ సాధించుకున్నామని,ఆనాడు సుష్మా స్వరాజ్ ఒత్తిడితో తెలంగాణ వచ్చిందని అంతేకానీ కేసీఆర్ దొంగ దీక్ష తో తెలంగాణ రాలేదని అన్నారు,ప్రతి ఒక్క పార్టీ పథకాలు,హామీలు ఇస్తాం అని చెప్పడం తప్ప తెలంగాణపై ఉన్నటువంటి అప్పునేలా తీరుస్తారని చెప్పడం లేదన్నారు,ఇప్పటికే రాష్ట్రంలో ఒక్కొక్కరిపై ఒక్క లక్ష ఇరవై వేల అప్పువుందని,రాష్ట్రాన్ని అప్పుల కుప్పల నుండి తీర్చే పార్టీ బీజేపీ అన్నారు,రాష్ట్రంలో కాంగ్రెస్ తో గెలిచిన అభ్యర్థులు బీఆర్ఎస్ లో చేరడం ఖాయమని పేర్కొన్నారు,అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమన్నారు, దేశంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చాక అస్సలు మతవిద్వేషాలు చలారేగలేవని, రాష్ట్ర, తాలూకాలో కూడా బీజేపీ అధికారంలోకి వచ్చాక మత విద్వేషాలు లాంటిది ఉండవని అన్నారు,గతంలో భైంసా అల్లర్లలో హిందూ సమాజం బాగా నష్టపోయిందని, హిందూ సమాజానికి అండగా ఉన్నటువంటి ధర్మ రక్షకులకు జోహార్లు అంటూ తెలిపారు,బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించిన ఘనత, ఎస్సీ వర్గీకరణ కమిటీ బీజేపీతోనే సాధ్యమన్నారు, భైంసా పరిస్థితిలను దృష్టిలో పెట్టుకుని తాలూకాలో కాషాయ జెండా ఎగరలని, దానికై బీజేపీ అభ్యర్థి రామారావు పటేల్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు,తాను గెలవగానే బాసర అభివృద్ధి, ట్రిపుల్ ఐటీ సమస్యలు, విద్యాలయాల నిర్మాణాలు, సదుపాయాలు కల్పించడం, సిరల కట్ట సమస్య, గడ్డెన్న పిల్ల కాలువల ద్వారా 14000 ఎకరాలకు నీరందించడం, ఆసుపత్రి సౌకర్యాలు మెరుగుపరచడం లాంటి కార్యక్రమాలను వెంటనే చేపడుతానని రామారావు పటేల్ పేర్కొన్నారు, నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుండి ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు,ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా, తాలూకా, మండల స్థాయి నాయకులు, తదితరులు, పాల్గొన్నారు.*

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india