V1News Telangana

best news portal development company in india

అత్యధిక మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీని గెలిపించండి

SHARE:

 ప్రచారంలో పాల్గొన్న పోచారం సురేందర్ రెడ్డి…

రుద్రూర్ V1 న్యూస్  : బీఆర్ఎస్ ప్రభుత్వం తోనే అభివృద్ధి సాధ్యమని బాన్సువాడ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ నాయకులు పోచారం సురేందర్ రెడ్డి తెలిపారు . తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం రుద్రూర్ మండల కేంద్రంలో బూత్ ల వారీగా బీఆర్ ఎస్ శ్రేణులు ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో బాన్సువాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ పోచారం సురేందర్ రెడ్డి పాల్గొని ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. బాన్సువాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డిని కారు గుర్తుకె ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నూతనంగా విడుదల చేసిన మ్యానిఫెస్టోలోని అంశాలు కేసీఆర్ భీమా పథకం ద్వారా ప్రతి పేద ఇంటికి రూ.5 లక్షలు, రైతులకు రైతు బందు సహాయం ద్వారా రూ.16,000, పేద కుటుంబాలకు గ్యాస్ సిలిండర్ రూ.400, ఆసరా పెన్షన్ లు రూ.5016, సౌభాగ్య లక్ష్మి పేద మహిళలకు రూ.3000, కేసీఆర్ ఆరోగ్య రక్ష రూ. 15 లక్షలు, దివ్యంగుల పెన్షన్ రూ. 6,016 ఇలా ముఖ్యమంత్రి కేసిఆర్ అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారని అన్నారు. వీటి గురించి ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను అందజేశారు. గుర్తుకు ఓటు వేసి బాన్స్వాడ నియోజకవర్గం అభ్యర్థి పోచారం శ్రీనివాస్రెడ్డిని బారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో బీఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పత్తి లక్ష్మణ్, పార్టీ ప్రధాన కార్యదర్శి బాలరాజు, పార్టీ గ్రామ అధ్యక్షుడు తోట్ల గంగారం, విండో చైర్మన్ సంజీవ్ రెడ్డి, మాజీ విండో చైర్మన్ పత్తి రాము, పార్టీ సీనియర్ నాయకులు అక్కపల్లి నాగేందర్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Thatipamula Rajashekhar
Author: Thatipamula Rajashekhar

PRESS

best news portal development company in india