V1News Telangana

best news portal development company in india

ఒక్క సారి అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేస్తా…! – బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి పవార్ రామారావు పటేల్ ..

SHARE:

ఒక్క సారి అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేస్తా…!

– బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి పవార్ రామారావు పటేల్ ..

నిర్మల్,నవంబర్ 17(వి1 న్యూస్ తెలుగు): ఒక్కసారి ఆశీర్వదించి అవకాశం ఇవ్వండి ముధోల్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి పవార్ రామారావు పటేల్ అన్నారు,శుక్రవారం తానూర్ మండలం లోని కోలూర్,మసల్గా,మొగిలి,కుప్టీ,కళ్యాణీ,జౌల(కే),
వడ్గాం,సింగన్ గావ్,నందగాం,దౌలతాబాద్,
ఖర్బాల,తోండాల,జౌల(బి),వాడోన,ఎల్వత్
గ్రామాలలో ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించారు.,

,ముందుగా ఆయా గ్రామాల్లోని ప్రధాన ఆలయాలలో ప్రత్యేక పూజలు చేశారు,ఎన్నికల ప్రచార యాత్రను ఆయా గ్రామాలలోని ప్రధాన విధుల్లో తిరుగుతూ ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించారు,అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో తనను గెలిపించాలని కోరారు,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ,పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి ఆయుష్మాన్ భారత్,చిరు వ్యాపారులకు ఆర్థిక సహాయం ఇలా ఎన్నో పథకాలను అందిస్తున్నది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే అని అన్నారు,బీజేపీ పార్టీకి అవకాశం ఇవ్వకున్నా ఇన్ని విధాలుగా మీకు అండగా నిలుస్తూ వచ్చింది,ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి ఇంకెన్నో సంక్షేమ పథకాలు అమలుచేస్తుందని అన్నారు,ఈ రాష్ట్ర ప్రభుత్వం తాము ఇస్తున్నామని చెప్పుకుంటున్న డబల్ బెడ్ రూమ్ పథకం కూడా ప్రధాన్ మంత్రి గ్రామీన్ ఆవాస్ యోజనలో భాగమే అని అన్నారు,సొమ్ము కేంద్రానిది సోకు రాష్ట్ర ప్రభుత్వానిది అన్నట్టుగా
బిఆర్ఎస్ నాయకులు వ్యవహరిస్తున్నారని అన్నారు,ఉజ్వల పథకం ద్వారా ఉచితంగా కోట్ల గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చింది కూడా బిజెపి నే అని గుర్తు చేశారు,ఈ నెల 30తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు,ముధోల్
నియోజకవర్గ అభివృద్ధికి తనవంతుగా అన్నివిధాలా కృషి చేస్తానని తెలిపారు,ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ మండల ఇంచార్జీ జాదవ్ శివాజీ పటేల్,మాజి ఎంపీపీలు గంగాధర్ పటేల్,బాలేరావు లాలు,రామారావు,వెంగలరావు,
సర్పంచ్ సత్యనారాయణ పటేల్,నాయకులు మోహన్ రెడ్డి,చక్రధర్ పటేల్,రమేష్ పటేల్ దేవిదాస్ పటేల్,సోమనాథ్,భీం రావు పటేల్,
పల్లే విఠ్ఠల్,నాయకులు,కార్యకర్తలు,బీజేపీ పార్టీ
అభిమానులు,తదితరులు,పాల్గోన్నారు..

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india