V1News Telangana

best news portal development company in india

ఉద్యోగాలు ఇస్తానని ఎగ్జామ్ పేపర్లు లీక్ చేసిండ్రు

SHARE:

 

ప్రచారం నిర్వహిస్తున్న బీజేపి నాయకులు….

రుద్రూర్ V1న్యూస్ : ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగులకు  ఉద్యోగాలు ఇస్తానని ఎగ్జామ్ పేపర్ లను లీక్ చేసిండ్రుఅన్ని  బీజేపి పార్టీ నాయకులు విమర్శించారు . ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా బుధవారం రుద్రూర్ మండలంలోని రాయకుర్, రాయకుర్ క్యాంప్, సిద్దాపూర్, సిద్దాపూర్ క్యాంపు గ్రామాలలో బిజెపి కార్యకర్తలు గడప గడపకు తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. బిజెపి ప్రభుత్వం అమలు చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ. బీసీ అభ్యర్థి కి పట్టం కట్టాలని, కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి యేండల లక్ష్మీనారాయణను గెలిపించాలని ప్రజలను కోరమన్నారు .నీళ్లు,నిధులు, నియమాకాలని, తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని కంకణం కట్టుకున్నారు.  కేసీఆర్ ఇచ్చిన పథకాలాన్ని కేంద్రం ఇచ్చిన నిధులతోనే సరిపెట్టుకున్నారని, ఆ నిధులు కూడా తన పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఇచ్చారన్నారు. అవి కూడా కమిషన్లు తీసుకొని జీఎస్టీ రూపంలో ఐదు లక్షల డబుల్ బెడ్ రూమ్ కు ఒక్కొక్క దగ్గర మూడు లక్షల 80000 మూడు తొంబై నాలుగు లక్షలు మాత్రమే ఇవ్వడం జరిగిందన్నారు. విద్యార్థుల గోసా అయితే చాలా ఘోరంగా ఉందని వేల ఉద్యోగాలు ఇస్తానని ఎగ్జామ్ పేపర్లను  అమ్ముకున్న బీఆర్ఎస్ పార్టీ ఒడించాలన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు హరి కృష్ణ, జిల్లా ఓబీసీ ప్రధాన కార్యదర్శి సుధాకర్ గౌడ్, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Thatipamula Rajashekhar
Author: Thatipamula Rajashekhar

PRESS

best news portal development company in india