V1News Telangana

best news portal development company in india

గడ్డి మందు త్రాగి వ్యక్తి ఆత్మహత్య.

SHARE:

 

 

మృతి చెందిన మల్లమరి నరహరి….

రుద్రూర్  V1 న్యూస్ : రుద్రూర్ మండలంలోని సిద్దాపుర్ క్యాంప్ గ్రామానికి చెందిన మల్లమరి నరహరి (50) అను వ్యక్తి మద్యానికి బానిసై, ఎలాంటి పని చేయకుండా త్రాగడానికి డబ్బులు ఇవ్వమని కుటుంబ సభ్యులతో గొడవపడేవాడని, డబ్బులు ఇవ్వకుంటే గడ్డిమందు త్రాగి చచ్చిపోతాను అని బెదిరించే వాడు. అదే క్రమములో ఈ నెల 13, సోమవారం రోజున మధ్యాహ్నం గడ్డి మందు తాగాడు  తెలుసుకున్న కుటుంబ సభ్యులు  చికిత్స నిమిత్తం  నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అదేరోజు సుమారు 7 గంటల సమయంలో నిజామాబాద్ ఆసుపత్రిలో చనిపోవడం జరిగిందన్నారు. మృతుని కొడుకు అశ్వద్ధామ పిర్యాదు మేరకు ఎస్సై నీరేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Thatipamula Rajashekhar
Author: Thatipamula Rajashekhar

PRESS

best news portal development company in india