V1News Telangana

best news portal development company in india

రానున్న ఎన్నికల్లో బీఆర్ ఎస్ పార్టీని గద్దె దించాలి.

SHARE:

 

ప్రచారం నిర్వహిస్తున్న బిజీపి నాయకులు…

రుద్రూర్ V1 న్యూస్ : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ ఎస్ పార్టీని గద్దె దించాలని బీజేపి నాయకులు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం రుద్రూర్ మండల కేంద్రంలోని జేయన్సీ కాలనీ, అంబేద్కర్ కాలనీ, అక్బర్ నగర్ గ్రామాలల్లో బిజేపి శ్రేణులు ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. బీజేపి ప్రభుత్వం అమలు చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి బాన్సువాడ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి యేండల లక్ష్మి నారాయణను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. బీజేపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉచిత విద్య, ఉచిత వైద్యం, రైతుల మద్దతు ధర, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ప్రతి పేదవాడికి ఇల్లు, ఆరు నెలకోసారి జాబ్ క్యాలెండర్, లాంటి మరెన్నో పథకాలను  బిజెపి పార్టీ అధికారులకు రాగానే  అమలు చేస్తుందని తెలిపారు . కొన్ని పార్టీలు ఇష్టం వచ్చినట్టు వాగ్దానాలు చేస్తూ  అబద్దాలు మాట్లాడుతూ. ఇచ్చిన  హామీలను అమలు చేయలేని పార్టీలు. ఏం మొఖం పెట్టుకొని ఇంకా ప్రజల దగ్గర ఓట్లు  అడుగుతున్నారని విమర్శించారు. ఈ ప్రచార కార్యక్రమంలో బీజేపి పార్టీ మండల అధ్యక్షులు హరి కృష్ణ, సుధాకర్ గౌడ్, శంకర్ పటేల్,  గణేష్ బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Thatipamula Rajashekhar
Author: Thatipamula Rajashekhar

PRESS

best news portal development company in india