V1News Telangana

best news portal development company in india

బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి.

SHARE:

 

బీఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు పోచారం సురేందర్ రెడ్డి…

 

రుద్రూర్ V1 న్యూస్ : –  బీఆర్ఎస్ పార్టీ గెలుపుకోసం పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని బీఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పోచారం సురేందర్ రెడ్డి సూచించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రుద్రూర్ మండల కేంద్రంలోని బీఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం బూత్ ల వారీగా బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని కార్యకర్తలకు ఎన్నికల ప్రచారంపై సూచనలు సలహాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బూత్ ల వారీగా కార్యకర్తలు నాయకులు బిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ప్రతి కుటుంబం పొందిన లబ్ది గురించి చర్చించి కెసిఆర్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు ఆయన దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పత్తి లక్ష్మణ్, కార్యదర్శి నేరుగంటీ బాలరాజు జడ్పిటిసి నారోజి గంగారం, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ తోట సంగయ్య,బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు తోట్ల గంగారం, మాజీ విండో చైర్మన్ పత్తి రాము, చిదుర వెంకటేశం సేట్,అక్కపల్లి నాగేందర్, సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు షేక్ ఖాదర్ నాయకులు గోవింద్ రావు పటేల్,బందేల సంజీవ్,పత్తి నవీన్ ,బాపూజీ లింగం,మోహన్,అర్ సాయిలు, కలీమ్ ఖురేషి, షేక్ గులాబ్ ,కిషోర్ ,రవికిరణ్,అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.

Thatipamula Rajashekhar
Author: Thatipamula Rajashekhar

PRESS

best news portal development company in india