రుద్రూర్ V1 న్యూస్ : రుద్రూర్ మండల కేంద్రానికి చెందిన నక్క సాయిలు అలియాస్ (ఛత్రపతి) (30), అను వ్యక్తి (గూండ్ల) తన తండ్రి నక్క పోశెట్టి (45)ని హత్య చేశాడు. సిఐ జయేష్ రెడ్డి, ఎస్ఐ నీరేష్ తెలిపిన వివరాల ప్రకారం నక్క పోశెట్టి అప్పు డబ్బుల కోసం ఇంట్లో తరచూ గొడవలు చేస్తూ, పంచాయతీలు పెటడుతున్నారని, విసుగు చెందిన సాయిలు ఎలాగైనా తన తండ్రిని చంపాలని పథకం వేసుకుని శనివారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో నక్క సాయిలు తన తండ్రి పోశెట్టిని శాలువాతో గొంతు బిగించి హత్య చేసి, పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు డాగ్ స్కావాడ్ తో. ఘటన స్థలానికి చేరుకొని ఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించి, కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బోధన్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని తెలిపారు.
Author: Thatipamula Rajashekhar
PRESS









