V1News Telangana

best news portal development company in india

బోధన్ లో రాణి రుద్రమదేవి ల ప్రజా సేవ చేస్తున్న అయేషా ఫాతిమా… కుల మతాలకు అతీతంగా పేద ప్రజలను ఆదుకుంటున్న ఆయేషా ఫాతిమా…. రోజుకు 15 గంటలు ప్రజాసేవే…

SHARE:

అసెంబ్లీ ఎన్నికలు దగ్గరవుతున్న సమయంలో అన్ని పార్టీల నాయకులు తమ పార్టీ బలగాన్ని పెంచే పనుల్లో ఉన్నారు. అయితే బోధన్ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి షకీల్ అమీర్ గారి సతీమణి అయేషా ఫాతిమా ఆమెర్ రోజుకు 15 గంటలు ప్రజల్లోనే ఉంటున్నారు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో గ్రామాల్లో తిరుగుతూ ప్రజా సమస్యలను తెలుసుకుంటున్నారు ఆ సమస్యలకు తక్షణమే పరిష్కారం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయేషా ఫాతిమా ఆమెర్ తన క్యాడర్ తో నియోజకవర్గంలోని ప్రజల వద్దకు వెళ్తా ఉంటే ప్రజలు కూడా బాగానే రెస్పాండ్ అవుతున్నారు.

నియోజకవర్గంలో రాణి రుద్రమదేవి లాగా అయేషా ఫాతిమా ఆమెర్ ప్రజాసేవ చేసే నాయకురాలని, అదేవిధంగా నియోజకవర్గంలోని ఇతర నాయకులు చాలామంది ఉన్నారని కానీ వాళ్లు కార్ల నుండి దిగి ప్రజలకు వద్దకు వెళ్లడానికి అంతగా ఇష్టపడరని, ప్రజల్లో నుంచి పుట్టిన నాయకురాలు అయేషా ఫాతిమా ఆమెర్ అంటూ నియోజకవర్గ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బోధన్ ప్రజలకు భరోసానిస్తూ నేనున్నానంటూ వాళ్లకు ఆదుకుంటూ పేద ప్రజల ఆశ జ్యోతిల నియోజకవర్గానికి వెలుగు నిచ్చే నాయకురాలు ఆయెష ఫాతిమా తనదైన శైలితో పేద ప్రజల మనసుల్లో స్థానాన్ని దక్కించుకుంటున్నారు. ఉదయం 9 గంటల నుండి రాత్రి 11 గంటల సమయం వరకు ఆయేషా ఫాతిమా ప్రజల్లోనే ఉంటున్నారు. ఆయేశా ఫాతిమా ఆమెర్ పని చూస్తా ఉంటే మరోసారి షకీల్ అమీర్ ఎమ్మెల్యే గా గెలుపొంది బోధన్ నియోజకవర్గం లో బిఆర్ఎస్ పార్టీ జండా ఎగురవేయడం ఖాయమని కొందరు రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

 

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india