రామగుండంలో జన సంద్రోహంతో కాషాయదళం నామినేషన్ మహోత్సవానికి భారీగా తరలి వచ్చిన ప్రజలు

బిజెపికి మద్దతు తెలిపిన జనసైనికులు…
రామగుండం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందుల సంధ్యారాణి..
V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం నవంబర్ 10:-
రాముడు సాక్షిగా రామగుండానికి రామరాజ్యం పాలన తీసుక వస్తానని.. అవినీతి లేకుండా ప్రజలకు పరిపాలనను అందిస్తానని బిజెపి రామగుండం ఎమ్మెల్యే అభ్యర్థి కందుల సంధ్యారాణి అన్నారు. రామగుండం బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్లే ముందు మొదటగా సంధ్యారాణి భర్త, అత్తమ్మ, అక్క బావల దీవెనలు తీసుకొని తన సొంత గ్రామమైన రామగుండం మండలం లింగాపూర్ గ్రామంలోని భక్త ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామి వారి పాదాల వద్ద నామినేషన్ పత్రాలను పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నేరుగా జనగామ గ్రామంలోని త్రీ లింగేశ్వర స్వామి ఆలయంలో స్వామి వారికి అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోదావరిఖని కోదండ రామాలయంతో పాటు, జవహర్ లాల్ నగర్ లోని దుర్గ మాత ఆలయంలో పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు అర్చకులు సంధ్యారాణిని విజయీభవ అని దీవిస్తూ తమ ఆశీర్వాదాన్ని అందించారు. అనంతరం దుర్గ మాత ఆలయం దగ్గర నుండి గోదావరిఖని ప్రధాని చౌరస్తా, మున్సిపాలిటీ జంక్షన్, ఎన్టీపీసీ వరకు బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి అభ్యర్థి సంధ్యారాణికి మద్దతుగా పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన కార్యకర్తలు గోదావరిఖని ఒకటో పోలీస్ స్టేషన్ వద్ద ఘన స్వాగతం పలికి సంధ్యారాణికి మద్దతుగా పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. ఆటపాటలు కోలాటాలు, డ్యాన్సులు, డబ్బు చప్పులతో నిర్వహించిన నామినేషన్ మహోత్సవ కార్యక్రమానికి ప్రజలు మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ నామినేషన్ మహోత్సవానికి పెద్ద సంఖ్యలో మహిళలు బతుకమ్మలతో సంధ్యారాణికి ప్రధాన చౌరస్తాలో స్వాగతం పలికారు. అనంతరం బీజేపీ అభ్యర్థి సంధ్యారాణి మాట్లాడుతూ… గోదావరిఖని చౌరస్తా పోచమ్మ సాక్షిగా.. పోచమ్మ తల్లి స్థలాన్ని కబ్జా చేసిన నాయకులకు బుద్ధి చెప్పాలన్నారు. త్రీ లింగేశ్వర స్వామి శివుడి సాక్షిగా దుర్గ మాత దేవి సాక్షిగా నన్ను గెలిపిస్తే రామగుండానికి రామ రాజ్యాన్ని తీసుకువచ్చి ప్రజలకు పాలన అందించడంతో పాటు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తానని ప్రమాణం చేశారు. ఇక్కడి స్థానిక నాయకుడు గెలిచాక రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉద్యోగాల పేరుతో ఎంతో మంది యువకులను మోసం చేయడంతో ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఉన్నాయని ఇలాంటి వారిని మళ్లీ గెలిపిస్తే మరిన్ని కుంభకోణాలకు పాల్పడతారని విమర్శించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రజల్లో సానుభూతి పొందాలని చూస్తున్నారని అలాంటి వారిని సానుభూతితో గెలిపిస్తే రామగుండంలో రావణ కాష్టగా మారుస్తారని ఘాటుగా ఆరోపించారు. గోదావరి నీరు కలుషితమవుతున్న ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందించడంలో కూడా స్థానిక నాయకులు విఫలమయ్యారన్నారు. మరోవైపు ఎక్కడ చూసినా రోడ్లు డ్రైనేజీలు వస్తావస్తంగా తయారయ్యాయని ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో నాయకుల విఫలం కావడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. నవంబర్ 30వ తేదీన జరిగే ఎన్నికల్లో రామగుండం నియోజకవర్గంలో బిజెపి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే గోదావరిఖని ప్రాంతాన్ని ఆరు నెలల్లో స్మార్ట్ సిటీగా మారుస్తానని అన్నారు. అనంతరం ఎన్నికల ఆర్వో కార్యాలయంలో తమ నామినేషన్ ను దాఖలు చేశారు. ఈ సందర్భంగా రామగుండం నియోజకవర్గం లో అక్క చెల్లెలు అన్నదమ్ములు తనను ఆడబిడ్డగా ఆదరించి ఒక అవకాశం ఇచ్చి బిజెపిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
Author: Namani Rakesh Netha
STAFF REPORTER RAMAGUNDAM








