V1News Telangana

best news portal development company in india

*జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్ లో ఉగ్రవాది హతం*

SHARE:

జమ్ము కశ్మీర్‌లోని షోపియాన్‌లో భద్రతా బలగాలు,లస్కరే తోయిబా ఉగ్రవాదుల మధ్య గురువారంఉదయం ఎదురు కాల్పులు జరిగాయి.

ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ ముష్కరుడు హత హతమైనట్లు తెలిసింది. ఇవాళ తెల్లవారుజామున భద్రత బలగాలకు లస్కరే తోయిబా ఉగ్ర సంస్థకు చెందిన ఉగ్రవాదులు ఓ ఇంటిలో ఉన్నట్టు సమాచారం అందడంతో ఆ ఇంటిని భద్రత బలగాలు చుట్టుముట్టాయి.

దీంతో షోపియాన్‌లోని కతోహలెన్‌ ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు ప్రారంభమయ్యాయి.

ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో ఓ టెర్రరిస్టును మట్టుబెట్టామని కశ్మీర్‌ జోన్‌ పోలీసులు తెలిపారు.

అతడిని లస్కరే తోయిబా ఉగ్రసంస్థకు చెందిన ఉగ్రవాదిగా గుర్తించామని వెల్లడించారు.

ఘటనా స్థలంలో ఆయుధాలు, యుద్ధ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని భద్రత బలగాలు వెల్లడించాయి…..,

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india