V1News Telangana

best news portal development company in india

విజయోత్సవ శోభాయాత్రను తలపించిన కోరుకంటి నామినేషన్ ర్యాలీ వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు 

SHARE:

విజయోత్సవ శోభాయాత్రను తలపించిన కోరుకంటి నామినేషన్ ర్యాలీ వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు

గులాబీ మయమైన ప్రధాన రహదారులు

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం నవంబర్ 09:-

తన నామినేషన్ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ రామగుండం నియోజకవర్గ అభ్యర్థి కోరుకంటి చందర్ గురువారం నిర్వహించిన ర్యాలీ విజయోత్సవ శోభాయాత్రను తలపించింది. తిలక్ నగర్ డౌన్ లోని ఆయన ఇంటి నుండి మొదలుకొని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం, లక్ష్మీనగర్, ఖని ప్రధాన చౌరస్తా, మున్సిపల్ టి జంక్షన్ వరకు ప్రధాన రహదారులన్నీ రెప రెపలాడుతున్న జెండాలతో గులాబీ మయమయ్యాయి. చౌరస్తా నుండి ఎటుచూసినా నలువైపులా కనుచూపుమేర కార్యకర్తలు, జనంతో కిక్కిరిసిపోయాయి. ముందుగా తన నామినేషన్ ను పురస్కరించుకొని స్టేడియం పక్కనున్న జయదుర్గా దేవి ఆలయంలో రాష్ట్ర మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్, స్నేహలత దంపతులతోపాటు జనగామలోని త్రిలింగ రాజరాజేశ్వర స్వామి దేవాలయం, సుందిల్లలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం, గోదావరిఖనిలోని శ్రీ కోదండ రామాలయం, ప్రాంగణంలోని శివాలయం, అయ్యప్ప దేవాలయం, పవర్ హౌజ్ కాలనీలోని కాశీ విశ్వేశ్వరాలయం, 37వ డివిజన్ లోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయాలలో చందర్ ప్రత్యేక పూజలు చేసారు. తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకున్నారు. తిలక్ నగర్ డౌన్ లోని తన ఇంటి నుండి బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, కార్మికులు, మహిళలు, అభిమానులు వెంటరాగా, డప్పులు, బ్యాండు మేళాలు, మంగళ వాయిద్యాలు, ఒగ్గుడోలు బృందాలు, బతుకమ్మలు, మహిళల కోలాట నృత్యాలు, రామక్కపాటకు లయబద్దంగా నృత్యం చేస్తున్న కళాకారులు, యువకులతో జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఏర్పాటు చేసిన నామినేషన్ మహోత్సవ ఆశీర్వాద సభకు ప్రత్యేక వాహనంలో ర్యాలీగా తరలివెళ్లారు. దారి పొడుగునా..అడుగడుగునా మహిళలు మంగళ హారతులతో, పూలు చల్లుతూ ఆయనకు ఘన స్వాగతం పలికారు. స్టేడియం గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన నామినేషన్ మహోత్సవ ఆశీర్వాద సభా వేదికపై హిందూ పురోహితులు, ముస్లిం మౌల్వీలు, క్రైస్తవ ఫాస్టర్ లు చందర్ కి దైవ ఆశీర్వచనాలు అందజేశారు. సభకు హాజరైన ప్రజలనుద్దేశించి ప్రసంగించిన అనంతరం ఆయన చౌరస్తాలోని అమర వీరుల స్తూపానికి నివాళులర్పించారు. గాంధీ విగ్రహానికి, మున్సిపల్ టి జంక్షన్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, ఎన్టిపిసి టిటిఎస్ లోని నామినేషన్ కేంద్రానికి తరలివెళ్లారు. మొత్తానికి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోరుకంటి చందర్ నామినేషన్ ర్యాలీ విజయోత్సవ శోభా యాత్రను తలపించింది.

Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

best news portal development company in india