Post Views: 139

24 వ వార్డు ప్రచారంలొ అయోషా ఫాతిమా
బోధన్ V1 న్యూస్ : అసెంబ్లీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా బోధన్ పట్టణంలోని 24 వ వార్డులో బుధవారం బోధన్ నియోజకవర్గ బీఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి షకీల్ అమీర్ సతీమణి అయోషా ఫాతిమా జోరుగా ప్రచారం నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం నూతనంగా విడుదల చేసిన మ్యానిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించారు. కారు గుర్తుకు ఓటు వేసి బోధన్ నియోజకవర్గ బీఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి షకీల్ అమీర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె ఓటర్లను కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో బీఆర్ ఎస్ పట్టణ అధ్యక్షులు రవీందర్ యాదవ్, బీఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Author: Thatipamula Rajashekhar
PRESS








