రేపే నామినేషన్ రామగుండం ప్రజలు మళ్ళీ ఆశీర్వదించాలి రామగుండం అభివృద్ధికి సహకరించాలి 
నామినేషన్ ఆశీర్వాద సభను విజయవంతం చేయండి
వెలదిగా ప్రజలు తరలివచ్చి ఆశీర్వాదించండి
రామగుండం ఎమ్మెల్యే బిఆర్ఎస్ అభ్యర్థి కోరుకంటి చందర్
V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం నవంబర్ 08:-
స్థానిక జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈనెల 9వ తేదీన ఉదయం 10 గంటలకు నామినేషన్ ఆశీర్వాద సభకు నియోజకవర్గపు ప్రజలంతా తరలివచ్చి.. సభను విజయవంతం చేయాలని రామగుండం ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోరుకంటి చందర్ కోరారు. 2018లో మీ ఆశీస్సులతో ఎమ్మెల్యేగా గెలిచిన నేను, మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఐదేళ్ల కాలంలో నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ధి చేశానని, ఉపాధి అవకాశాలకు కృషి చేశానని అన్నారు. అదేవిధంగా మెడికల్ కళాశాల, సబ్ రిజిస్టర్, కోర్టు భవన సదుపాయం లాంటి శాశ్వత మౌలిక వసతులను కల్పించాలని తెలిపారు. కరోనాతో రెండు సంవత్సరాలు వృధాగా గడిచాయని.. మిగిలిన పదవి కాలంలో పేద మధ్యతరగతి ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఉచితంగా అందించానని ఆయన అన్నారు. జిల్లా కేంద్రం కాకపోయినా ముఖ్యమంత్రి కెసిఆర్ ఆశీస్సులతో రామగుండంలో మెడికల్ కళాశాల మంజూరు చేయించానని తెలిపారు. 50 సంవత్సరాలుగా హక్కు లేకుండా ఉన్న అంతర్గాం మండలం పెద్దంపేట్ రాయదండి గ్రామాల రైతులకు కుర్జు కమ్మీల భూములకు పట్టాలు ఇప్పించామని అదేవిధంగా దశబ్ద కాలంగా నిర్మాణానికి నోచుకోని బసంత్ నగర్ డేంజర్ జోన్ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి రైల్వే శాఖ అటవీ శాఖ అనుమతులు ఉండి నిర్మాణాన్ని ప్రారంభించాను. సింగరేణి, ప్రభుత్వ స్థలాల్లో ఇండ్లు నిర్మించుకున్న వారికి జీవో నెంబర్ 58, 59, 76 ద్వారా పట్టాలు ఇప్పించడం జరిగిందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించడం జరిగిందన్నారు. అంతేకాకుండా తన సతీమణి విజయమ్మ పేరిట ఏర్పాటుచేసిన విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు ఆర్థిక స్వావలంబన కోసం శిక్షణను ఇప్పించానని ఆయన అన్నారు. శిక్షణ పొందిన వారికి జిల్లా ఎస్సీ కార్పొరేషన్, ఎన్టిపిసి సిఎస్ఆర్ ద్వారా ఉచితంగా కుట్టు మిషన్లను అందజేశానని తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనమైన 8వ కాలనీ, లింగాపూర్ గ్రామాలను తిరిగి గ్రామపంచాయతీలో కొనసాగేలా చేశాను. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ పరంగా 8వకాలనీ, పోతన కాలనీ మధ్య బ్రిడ్జిని ఏర్పాటు చేసి, ప్రధాన రహదారులను అండర్ గ్రౌండ్ డ్రైనేజీలతో పునర్ నిర్మించానని ఆయన తెలిపారు. యువతులకు ఉద్యోగ ఉపాధి కల్పన కోసం గోదావరిఖనిలో ఐటీ పార్కు, అంతర్గంలో ఇండస్ట్రియల్ పార్కులకు రాష్ట్ర మంత్రివర్యులు కేటీఆర్ గారితో శంకుస్థాపన చేయించామన్నారు. ముంపు ప్రాంతాల రక్షణ కోసం గోదావరి నదికి కరకట్ట నిర్మాణం, మెడికల్ కళాశాలకు అనుబంధంగా నర్సింగ్ కళాశాల, సింగరేణి అనుబంధ మైనింగ్ పాలిటెక్నిక్, మహిళా పోలీస్ స్టేషన్ తదితర అభివృద్ధి పనులను చేయాల్సి ఉంది. అందుకోసం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఈనెల 9వ తేదీన స్థానిక జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఏర్పాటుచేసిన నామినేషన్ ఆశీర్వాద సభకు నియోజకవర్గపు ప్రజలందరూ తరలివచ్చి నన్ను ఆశీర్వదించాలని.. బీఆర్ఎస్ కు మద్దతుగా నిలిచి కారు గుర్తుకు ఓటు వేసి భారి మెజార్టీతో గెలిపించి, మీకు సేవ చేసే అదృష్టాన్ని మరల కలిగించాలని ఎమ్మెల్యే కోరారు.
Author: Namani Rakesh Netha
STAFF REPORTER RAMAGUNDAM








