V1News Telangana

best news portal development company in india

అకాల వర్షానికి తడిసిన వరి ధాన్యం.

SHARE:

ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు…

రుద్రూర్ V1న్యూస్   : రైతులు ఆరు గాలం కష్టించి పండించిన ధాన్యం అకాల వర్షానికి తడిసి ముద్దాయింది. రుద్రూర్ మండల కేంద్రంలోని పలు గ్రామాలల్లో నిన్న కురిసిన అకాల వర్షానికి రైతులు పండించి ఆరాబోసిన ధాన్యం తడిసి ముద్దవ్వడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గ్రామాల్లోని కేంద్రాల్లో ధాన్యం విక్రయించేందుకు రైతులు కుప్పలు పోసి ఉంచారు. హఠాత్తుగా వర్షం కురవడంతో ధాన్యం కుప్పల, బస్తాలపై కవరులు కప్పుతూ అన్నదాతలు ఇబ్బందులు తప్పలేదు. అకాల వర్షం రైతుల పాలిట శాపంగా మారిందని రైతన్నలు వాపోతున్నారు.

Thatipamula Rajashekhar
Author: Thatipamula Rajashekhar

PRESS

best news portal development company in india