Post Views: 137
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ఎన్నికల కమిషన్ అన్ని చర్యలు తీసుకుంటోంది. ఎంతటివారి వాహనాన్ని అయినా అధికారులు ఆపి తనిఖీ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఆదివారం కొత్తగూడెంలో బీఆర్‌ఎస్ ప్రజాఆశీర్వాద సభ కోసం వచ్చిన సీఎం కేసీఆర్ ప్రయాణించే ప్రగతిపథం వాహనాన్ని ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు.
ఇటీవలే మంత్రి కేటీఆర్‌తో పాటు నిన్న హోం మంత్రి మహమూద్ అలీల వాహనాలను కూడా ఎన్నికల అధికారులు తనిఖీలు చేసిన విషయం తెలిసిందే.
తాజాగా సీఎం వాహనం తనఖీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఏదైనా సమాచారం మేరకు సీఎం బస్సును తనిఖీ చేసారా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది..
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








