V1News Telangana

సెంటిమెంట్ దేవుడికి కెసిఆర్ నేడు వినతి* సీఎం కేసీఆర్‌ సెంటిమెంట్‌ ఆలయం కోనాయిపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కెసిఆర్ కు బీఆర్ఎస్ పార్టీకి ఈ ఆలయం సెంటిమెంట్ గా మారింది..

*సెంటిమెంట్ దేవుడికి కెసిఆర్ నేడు వినతి*

సీఎం కేసీఆర్‌ సెంటిమెంట్‌ ఆలయం కోనాయిపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కెసిఆర్ కు బీఆర్ఎస్ పార్టీకి ఈ ఆలయం సెంటిమెంట్ గా మారింది..

ఏ ఎన్నికలు వచ్చినా ఇక్క డ పూజలు చేసిన తర్వాతే సీఎం కేసీఆర్‌ నామినేషన్‌ వేస్తారు. సీఎం కేసీఆర్‌, హరీశ్‌రావు , ఇతర పార్టీ నేతలు ఎన్నికల సమయంలో వెంకన్నకు దర్శనం చేసుకొని స్వా మివారి సన్నిధిలో నామినేషన్‌ పత్రాలు ఉంచి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తున్నది.

ఈ దేవాలయ ముఖద్వారం దక్షణం వైపు ఉంటుంది. ఇలా దక్షిణం వైపు ఉన్న దేవాలయాలు చాలా అరుదు. అది కూడా ఒక ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. కాగా, పురాతన ఆలయాన్ని అద్భుతంగా పునరుద్ధరించారు.

సీఎం కేసీఆర్‌ సూచనలతో మంత్రి హరీశ్‌రావు దేవాలయాన్ని రూ. 3 కోట్ల పైగా నిధులు వెచ్చించి గుడి పునర్నిర్మించారు.

విజయాల పరంపర
కోనాయిపల్లి వెంకన్నకు పూజలు చేసిన ప్రతిసారి సీఎం కేసీఆర్‌ కేసీఆర్‌కు విజయం వరించింది. 1985లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటి నుంచి ఇదే ఆనవాయితి కొనసాగిస్తున్నారు.

1989, 1994, 1999, 2001, 2004, 2009, 2014, 2018లో జరిగిన ఎన్నికల సమయంలో ఈ ఆలయంలో నామినేషన్‌ పత్రాలకు పూజలు చేసి, నామినేషన్‌ వేశారు. అన్ని సందర్భాల్లోనూ విజయం సాధించారు.

మరో విశేషం ఏమిటంటే, 2001లో టీడీపీకి, శాసనసభ డిప్యూటీ స్పీకర్‌, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి, ఆపై ఈ ఆలయంలోనే పూజలు చేసి టీఆర్‌ఎస్‌ ప్రస్తుత బీఆర్‌ఎస్‌ పార్టీని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు….

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Infoverse Academy

Vote Here

[democracy id="1"]

Recent Post

ఇంద్రమ్మ ఇళ్లలో మొదటి విడత అలాట్మెంట్ పూర్తి – మిగతావారికి నిరీక్షణే! ఇళ్లు కావాలని మిగతా అర్హుల ఆశలు – అధికారుల సూటి స్పందన . . ఇంద్రమ్మ ఇళ్లపై వైరల్ వీడియోకి గ్రామ పెద్దలు అధికారులు కౌంటర్ – దరఖాస్తు చేయలేదని వివరణ ఇళ్ల విషయంలో అవకతవకలు లేవన్న కార్యకర్తల స్పష్టీకరణ…

కల్దుర్కి ఇసుక మాఫియా… కండగావ్ ట్రాక్టర్లకు అడ్డుగోడలు! . ఇసుక పర్మిషన్ పేరుతో ట్రాక్టర్ ముఠాల ఆగడాలు.. ఎమ్మార్వోలా? ట్రాక్టర్ యజమానుల రాజ్యం కల్దుర్కిలో ఇసుక ముఠాల పంజా.. రెవెన్యూ అధికారుల మౌనం ప్రశ్నార్థకం! . ఇందిరమ్మ ఇళ్ల పేరుతో బ్లాక్ మార్కెట్ గేమ్?