V1News Telangana

best news portal development company in india

కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా రామగుండం బిజెపి అభ్యర్థి కందుల సంధ్యారాణి 

SHARE:

కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

రామగుండం బిజెపి అభ్యర్థి కందుల సంధ్యారాణి

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం నవంబర్ 03:-

లాభాల్లో ఉన్న సింగరేణిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నష్టాల్లోకి తీసుకెళ్లిందని దీంతో సింగరేణికి తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లుతుందని బిజెపి రామగుండం నియోజకవర్గ అభ్యర్థి కందుల సంధ్యారాణి పేర్కొన్నారు. ఈ మేరకు అర్జీ- 1 రీజియన్ లోని 1వ ఇంక్లైన్ లో ఏర్పాటు చేసిన గెట్ మీటింగ్ లో సంధ్యారాణి పాల్గొని కార్మికులను తనకు ఓటు వేసిగెలిపించాలని గెలిపించాలని అభ్యర్థించారు. అనంతరం సంధ్యారాణి మాట్లాడుతూ.. ఈ ప్రాంత ఆడబిడ్డగా, ఒక్కసామాన్య మహిళగా ఎమ్మెల్యే అభ్యర్థిగా బిజెపి నుండి పోటీ చేస్తున్నాని తనకు ఒక్క అవకాశం ఇచ్చి ఈ సారి ఎన్నికల్లో గెలిపిస్తే కార్మికుల సంక్షేమంతో పాటు, వారి సమస్యల పరిష్కారినికి కృషి చేస్తానని పేర్కొన్నారు. అంతే కాకుండా సింగరేణికి సంబంధించిన నిధులను ఇతర నియోజక వర్గాలకు తీసుకవెళ్తూ ప్రభుత్వం సింగరేణి నిధులను పక్కదారి పట్టిస్తోందని విమర్శించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు వేళా కోట్ల రూపాయలను బకాయిలను ఉందని వెంటనే ప్రభుత్వం సింగరేణికి చెల్లించాల్సిన బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేసారు. కేంద్ర ప్రభుత్వంపై కావాలని రాష్ట్ర ప్రభుత్వం కక్ష కట్టి తప్పుడు ప్రచారం చేయిస్తోందని మండిపడ్డారు.లగే కేంద్రంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్న బిఆర్ఎస్ నాయకులకు. రాష్ట్ర ప్రభుత్వానికి కార్మికులు తగిన బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. సామాన్య కుటుంభం నుండి వచ్చిన నాకు బిజెపి పార్టీ టికెట్ కేటాయించిందని ఒక్క మహిళగా తనకు అవకాశం కల్పించాలని కార్మికులను సంధ్యారాణి కోరారు. కార్మికుడి బిడ్డనని చెప్పి కార్మికుల ఓట్లతో గెలిచినా నాయకుడు కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారని ఆరోపించారు. మరో సారి ఎలాగైనా గెలవాలని కొంత మంది నాయకులు ఓట్ల కోసం మీ దగ్గరికి వస్తున్నారని ఓటు అనే ఆయుధంతో వారికి సరైన బుద్ది చెప్పే సమయం వచ్చిందని కార్మికులకు తెలిపారు. సింగరేణి కార్మికులు ఎంతో చైతన్య వంతం కలిగిన వారని ఒక్క సరి ఎవరైనా కార్మికుడిని నమ్మితే వారినే గెలిపిస్తారనే ఒక్క నమ్మకం సింగరేణి కార్మికుల్లో ఉందన్నారు. మొదటి సరిగా బిజెపి పార్టీ నుండి మహిళా అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని నాకు ఒక్క అవకాశం కల్పిస్తే నియోజకవర్గంతో పాటు కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కార్మికులకు పిలుపునిచ్చారు. ఒక్క అవకాశం కల్పిస్తే కార్మికుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఎంఎస్ అధ్యక్షులు యాదగిరి సత్తయ్య, సారంగపాణి, హరిన్, సతీష్, రాజేశం, వెంకటస్వామి, మహిపాల్, జక్కుల ప్రవీణ్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.

Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

best news portal development company in india