V1News Telangana

best news portal development company in india

ఎమ్మెల్యే షకీల్ ను విమర్శించే స్థాయి కౌన్సిలర్ శరత్ రెడ్డి కి లేదు.

SHARE:

 

కోర్టులో   ఐపీ పెట్టి  రైతులను నిండా ముంచి పారిపోయినవ్

బోధన్ V1 న్యూస్ : బోధన్ బిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే షకీల్ ను విమర్శించే స్థాయి కౌన్సిలర్ శరత్ రెడ్డి కి లేదని సాలూర మండలం బిఆర్ఎస్ నాయకులకు అన్నారు . గురువారం సాలూర మండల కేంద్రంలోని బిఆర్ఎస్ కార్యాలయంలో మాజీ రైతు బంధు మండల్ కోఆర్డినేటర్ బుద్దె రాజేశ్వర్, సాలూర మండలం బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు నర్సయ్య, లు మాట్లాడుతూ..శరత్ రెడ్డి గత చరిత్ర చూసుకొని మాట్లాడాలని హితువు పలికారు.గతంలో రైతుల దగ్గర వడ్లు తీసుకొని, డబ్బులు ఇవ్వకుండా కోర్టు నుండి ఐపీ పెట్టి నిండా రైతుల కు ముంచి పారిపోన సంగతి ప్రజలకు తెలుసు అని వారు అన్నారు. ఎమ్మెల్యే దొంగ అంటూ మాట్లాడి నువ్వు నిన్ను ఏమనాలో తెలుపలని అన్నారు. గతంలో రైస్ మిల్ మీద ఫిర్యాదు చేస్తే జిల్లా అధికారులు విచారణ చేసి ఎటువంటి అవినీతి లేదని తెలిపారని అన్నారు, మీ రైస్ మిల్ కు ప్రభుత్వం నుండి వడ్లు పంపారాని మీరు అమ్ముకున్నారని ఆరోపణ చేశారు.ఎమ్మెల్యే పై మాట్లాడిన అసభ్యకరమైన మాటలకూ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.లేని పక్షం లో మీకు మా కార్యకర్తలు అడ్డుకుంటారని హెచ్చరించారు.సహకార సంఘం చైర్మన్ అల్లె జనార్దన్,మాజీ ఉప సర్పంచ్ సరిడే. సాయులు, బుయ్యన్. సురేష్ లు సుధాకర్, శివకాంత్ పటేల్, నాగురావు చందూర్. సాయరెడ్డి,నబ్బు తదితరులు పాల్గొన్నారు.

Thatipamula Rajashekhar
Author: Thatipamula Rajashekhar

PRESS

best news portal development company in india