V1News Telangana

best news portal development company in india

బీఆర్ ఎస్ పథకాలు భేష్.

SHARE:

 

బిజెపి నుండి బీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు.

బోధన్  V1 న్యూస్ నవంబర్ 01 : బీఆర్ ఎస్ ప్రభుత్వం నూతనంగా విడుదల చేసిన మ్యానిఫెస్టోలోని  సంక్షేమ పథకాలకు ఆకర్షతులై సుమారు 30 మంది బిజెపి పార్టీ నుండి బీఆర్ ఎస్ పార్టీలో చేరారు. నవీపేట్ మండలంలోని మిట్టాపూర్ గ్రామానికి చెందిన యువకులు బుధవారం బోధన్ బీఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి షకీల్ అమీర్ స్వగృహంలో షకీల్ అమీర్ సమక్షంలో 30 మంది యువకులు బీజేపి పార్టీ విడి బీఆర్ ఎస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్బంగా షకీల్ అమీర్ మాట్లాడుతూ.. మ్యానిఫెస్టోలోని అంశాలు కేసీఆర్ భీమా పథకం ద్వారా ప్రతి పేద ఇంటికి రూ.5 లక్షలు, రైతులకు రైతు బందు సహాయం ద్వారా రూ.16,000, పేద కుటుంబాలకు గ్యాస్ సిలిండర్ రూ.400, ఆసరా పెన్షన్ లు రూ.5016, సౌభాగ్య లక్ష్మి పేద మహిళలకు రూ.3000, కేసీఆర్ ఆరోగ్య రక్ష రూ. 15 లక్షలు, దివ్యంగుల పెన్షన్ రూ. 6,016 ఇలా ముఖ్యమంత్రి కేసిఆర్ అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని  తెలిపారు . ఈ పథకాలకు ఆకర్షతులై పలువురు బీజేపి నుండి బీఆర్ ఎస్ లోకి చేరారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Thatipamula Rajashekhar
Author: Thatipamula Rajashekhar

PRESS

best news portal development company in india