V1News Telangana

best news portal development company in india

గోదావరిఖనిలో బేబీ స్టూడియో ప్రారంభం 

SHARE:

గోదావరిఖనిలో బేబీ స్టూడియో ప్రారంభం

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం అక్టోబర్ 29:-

గోదావరిఖని పట్టణంలోని అడ్డగుంటపల్లి సర్కిల్‌లో పోగుల విజయకుమార్, కొలిపాక అఖిల్ కుమార్ ల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన లిల్లీ పుట్ బేబి స్టూడియోను పెద్దపల్లి జిల్లా ఫోటో వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రెడ్డి భాస్కర్,జిల్లా గౌరవ సలహాదారులు లగిశెట్టి చంద్రమౌళి, ఎలగందల శ్రీనివాస్ లు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ గోదావరిఖని పట్టణంలో మొట్టమొదటిసారిగా బేబీ స్టూడియో ప్రారంభించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.గోదావరిఖని, పరిసర ప్రాంత ప్రజలు ,ఫోటో వీడియో గ్రాఫర్లు బేబి స్టూడియోను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా ఫోటో, వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నల్ల సతీష్,మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డివిఆర్ తులసి, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల అసోసియేషన్ నాయకులు, ఫోటో వీడియో గ్రాఫర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

best news portal development company in india