V1News Telangana

best news portal development company in india

తానూర్ మండలంలో జోరుగా సాగుతున్న బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం….

SHARE:

తానూర్ మండలంలో జోరుగా సాగుతున్న బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం….

నిర్మల్ అక్టోబర్ 29(వి1 న్యూస్ తెలుగు): తానూర్ మండలంలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది,మండల బీఆర్ఎస్ నాయకులు గడపగడపకు తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నారు
,ఆదివారం ఐదోవ రోజు తానూర్,హిప్నేల్లి తాండా,
హిప్నేల్లి,ఉమ్రీ(కే) గ్రామాలలో గడపగడపకు తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు,రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే విఠ్ఠల్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు,ఈ సందర్భంగా మాజి ఎంపీపీ రాజన్న మాట్లాడుతూ సీఎం కేసీఆర్ హయంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుందని ప్రజల సంక్షేమమే పరమావధిగా సీఎం కేసీఆర్ అనే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నరన్నారు,రైతు భీమా 5లక్షలు,400 రూపాయికే సిలిండర్,సౌభాగ్య లక్ష్మి,సన్న బియ్యం,రైతు బంధు,ఆసరా పెన్షన్,వికలాంగుల పెన్షన్,బిడి కార్మికుల పెన్షన్,కల్యాణ లక్ష్మీ,షాదిముబార్, రాష్ట్రం లోని మహిళ సమాఖ్య లకు సొంత భావన నిర్మాణం, ఇలాంటి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తుందన్నారు,అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు దోరుకుతున్నాయని తెలిపారు,బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గడ్డిగారి విఠ్ఠల్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు,
ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ చంద్రకాంత్ యాదవ్,సొసైటీ చైర్మన్ నారాయణ రావు
పటేల్,ఆత్మ చైర్మన్ కే.పోత రెడ్డి బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు చంద్రకాంత్ యాదవ్,సర్పంచ్లు తాన్సింగ్, దుప్పె శ్యాం పటేల్,ఉమ్రీ (కే) సర్పంచ్ రత్నామాల మారుతి పటేల్,మాజీ సర్పంచ్ బాబా సాహెబ్,ఉపసర్పంచ్ నయ్యుమ్ ఖాన్,సీనియర్ నాయకులు చంద్రశేఖర్,
పిరాజీ,కైలాస్,నాయకులు డి. రాములు,భీం రావు,సుభాష్,
కరీం,శాన్వాజ్,ఇరేష్,బాలాజీ,భగ్వాన్,వివిధ గ్రామాల కార్యకర్తలు,అభిమానులు,
తదితరులు,పాల్గొన్నారు..

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india