V1News Telangana

best news portal development company in india

ఆడబిడ్డకు అండగా ఆ రెండు గ్రామాలు.  గ్రామస్తులంతా ఏకం – కమలం విజయమే నినాదం.

SHARE:

ఆడబిడ్డకు అండగా ఆ రెండు గ్రామాలు. 

గ్రామస్తులంతా ఏకం – కమలం విజయమే నినాదం.

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం అక్టోబర్ 29:-

భారతీయ జనతా పార్టీ రామగుండం నియోజకవర్గ అభ్యర్థి కందుల సంధ్యారాణి ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా విలేజ్ రామగుండం మరియు పాములపేట గ్రామ మహిళలు మంగళ హారతులతో ఆశీర్వదించి ఘన స్వాగతం పలికారు.రెండు గ్రామాల నడిబొడ్డున ఏర్పాటు చేసిన సభలో దాదాపు 300 పైచిలుకు కుటుంబాలు బిఆర్ఎస్,కాంగ్రెస్ నుండి బిజేపి పార్టీలోకి చేరి కందుల సంధ్యారాణికి మరింత బలాన్ని చేకూర్చి అండగా నిలబడ్డాయి.ఈ సందర్భంగా సంధ్యారాణి గ్రామ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఇంటి ఆడబిడ్డగా ఆదరించి మీ కష్ట సుఖాలలో నన్ను భాగం చేసి మనమందరం కలిసి గెలిపించిన ఎమ్మెల్యేలు మనల్ని మోసం చేసి స్థానిక యువతను ఉద్యోగాల పేరుతో డబ్బులు దండుకుని మన కడుపులు కొట్టి పబ్బం గడుపుతూ విలాసవంతమైన జీవితాలను అనుభవిస్తూ మన గ్రామాలను అభివృద్ధికి దూరం చేశారని భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు.నన్ను నమ్ముకుని మాఇంటి ఆడబిడ్డ అనే గౌరవం ఇచ్చిన మీకు సహాయ – సహకారాలు అందించి మన ప్రాంతాలను మనమే అభివృద్ది చేసుకోవడానికి ఈసారి నియోజకవర్గ స్ధానిక ఎన్నికలు అనే అవకాశం ద్వారా రామగుండం బిజేపి పార్టీ నియోజకర్గ అభ్యర్థిగా మీ మధ్యలో నిల్చున్నానని ఏ అవినీతిపరుల,టూరిస్టుల పాలన మనకు వద్దని వారి పాలన నుండి మనల్ని మనమే కాపాడుకోవడానికి ఏకైక మార్గం ఓటు అనే ఆయుధంతో బిజేపి అభ్యర్థిగా కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించుకోవడం ద్వారానే సాధ్యమవుతుందని వివరించారు.అనంతరం రెండు గ్రామాల గ్రామస్థులు నిర్వహించిన భారీ ర్యాలీతో పల్లెల వీధులన్నీ కాశాయమయమై జనసందోహంతో నిండి భారత్ మాతా కి జై అంటూ హోరెత్తింది.పలు వీధుల్లో మహిళలు బతుకమ్మ ఆట పాటల కోలాహళాలతో సందడి చేసి పండగ వాతావరణం సృష్టించారు.

Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

best news portal development company in india