V1News Telangana

best news portal development company in india

రామగుండంలో స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ, గడపగడపకు పెరుగుతున్న ఆదరణ మళ్లీ సోమారపు రావాలంటు నినాదాలు

SHARE:

రామగుండంలో స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ

గడపగడపకు పెరుగుతున్న ఆదరణ మళ్లీ సోమారపు రావాలంటు నినాదాలు

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం అక్టోబర్ 28:-

రామగుండం స్థానిక మల్కాపురం, శాలపల్లి, జంగాలపల్లి,లోఇండిపెండెంట్ అభ్యర్థిగా సోమారపు సత్యనారయణ గడపగడప ప్రచారం నిర్వహించారు అత్యంత ప్రతష్టాత్మకంగా జరుగుతున్న ఎన్నికల కోలాహలం లో రామగుండం మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారయణ కి ప్రజలు ఘనస్వాగతం పలికారు,అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడుతూ వారు చెబుతున్న సమస్యలనువిని తాను గెలిచాక ఆ సమస్యలను తీరుస్తానని మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు, అలాగే 24 గంటల మంచినీటి సౌకర్యం, మెరుగైన పారిశుధ్యం,కల్పిస్తానని తెలిపారు ,తాను ఎమ్మెల్యే గా ఉన్నపుడు ఈ ప్రాతం లో చేసిన అభివృద్ధి చూసి ఓట్ వేయాలని , ఇక్కడ రౌడీయిజం, భూకబ్జాలు, అవినీతి అంతమొందించాలంటే తిరిగి తనను మళ్ళీ ఈ ప్రాంత ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఐదు సంవత్సరాలు సుపరిపాలన అందిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమం లో సోమరపు లావణ్య అరుణ్ కుమార్,రాజమణి,కుసుమ,సత్య ప్రకాష్ పుష్ప,కిషన్ రావు,మామిడాల చంద్రయ్య,భరథు,వడ్లూరిరవి, మంచుకట్ల బిక్షపతి, పిడుగు కృష్ణ,సుభాష్,డేవిడ్,చంద్ర శేఖర్, కిషోర్,సురేందరు,అధిక సంఖ్యలో మహిళలు యువకులు ప్రజలు పాల్గొన్నారు.

Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

best news portal development company in india