V1News Telangana

best news portal development company in india

అ ముగ్గురి వలనే పెండింగ్ లో ఉన్న బాన్స్వాడ కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన..

SHARE:

బాన్స్వాడ లో కాంగ్రెస్ అభ్యర్థి ని ప్రకటించని అధిష్టానం…

ఈ రోజు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సెకండ్ లిస్ట్ రిలీజ్ చేసింది. అందులో బాన్సువాడ నియోజకవర్గం గురించి కనీసం ప్రస్తావన రాలేదు. కామారెడ్డి జిల్లా అభ్యర్థి ని సైతం అధిష్టానం ప్రకటించ లేదు ఎల్లారెడ్డి నియోజకవర్గం నుండి మాధన్మోహన్ కు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం టికెట్ ఖరారు చేసింది. బాన్స్వాడ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ నుండి అభ్యర్థులు ఎక్కువగా ఉండటం మాల్యాద్రి రెడ్డి కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం ఢిల్లీ కి వెళ్లడం అధిష్టనానికి ఆలోచనలో పడేసింది. బాన్స్వాడ నియోజకవర్గం లో బరాస పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి పై మంచి పట్టు ఉన్న నాయకుడికి టికెట్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి ఆలోచనలో ఉన్నారట. గతంలో లో బాన్స్వాడ నుండి పోటీ చేసిన కాసుల బాలరాజ్ మరియు ఏనుగు రవీందర్ రెడ్డి, మాల్యాద్రి రెడ్డి ఈ ముగ్గురి పేర్లు లిస్ట్ లో ఉన్నాయి. పార్టీ నాయకులను బుజ్జగించి బాన్స్వాడ ఎమ్మెల్యే టికెట్ ఖరారు చేస్తే బాగుంటదని అధిష్టానం సమయం తీసుకుంటుంది.

IRFAN Reporter
Author: IRFAN Reporter

Work from as a journalist

best news portal development company in india