రామగుండం లో ఎమ్మెల్యే బీ.ఆర్.ఎస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలి
V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం అక్టోబర్ 27:-

రామగుండం లో ఎమ్మెల్యే బీ.ఆర్.ఎస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని బీ.ఆర్.ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మూల విజయ రెడ్డి రామగుండం నగర డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు అన్నారు. స్థానిక తిలకనగర్ లోని విశ్వం కమ్యూనిటీ హాల్ తిలక్ నగర్ పట్టణ కమిటి పరిధి 5 డివిజన్ల బిఆర్ఎస్ మహిళ కమిటి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గెలుపు కోసం ఇంటింటి ప్రచారం చేసి బీ.ఆర్.ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యాక్రమాలను వివరిస్తూ రాబోవు ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి చందర్ అన్న ని అత్యధిక మెజారిటీ తో గెలిచేలా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తిలక్ నగర్ పట్టణ కమిటీ అధ్యక్షులు చెలుకలపల్లి శ్రీనివాస్ పట్టణ కమిటీ ఇంచార్జ్ వంగశ్రీనివాస్ కార్పొరేటర్ కొమ్ము వేణు కార్పోరేటర్లు కార్పొరేటర్ పెంట రాజేష్ పాముకుంట్ల భాస్కర్ నాయకులు మాదాసు రామమూర్తి కరుక శ్రీనివాస్ మెరుగు చంద్ర మౌళి తదితరులు పాల్గొన్నారు.
Author: Namani Rakesh Netha
STAFF REPORTER RAMAGUNDAM








