V1News Telangana

best news portal development company in india

బీజేపీకి గుడ్‌బై చెప్పిన నటి గౌతమి.. పాతికేళ్ల ప్రస్థానానికి స్వస్థి

SHARE:

 

సీనియర్ సినీ నటి గౌతమి తాడిమల్ల.. బీజేపీకి రాజీనామా చేశారు. డబ్బు, ఆస్తి విషయంలో తనను మోసం చేసిన ఓ వ్యక్తికి బీజేపీలోని కొందరు సీనియర్ నేతలు సపోర్టుగా నిలిచారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీతో రెండున్నర దశాబ్దాలకు పైగా అనుబంధం ఉన్న ఆమె.. అక్టోబర్ 23 సోమవారం నాడు.. రాజీనామా లేఖ రాశారు. తనకు వ్యక్తిగతంగా సమస్యలు వచ్చినప్పుడు పార్టీ నుంచి సపోర్ట్ లేకపోవడం వల్లే రాజీనామా చేస్తున్నట్లు లేఖలో తెలిపారు.
గౌతమి పాతికేళ్ల కిందట బీజేపీలో చేరారు. ఎప్పుడూ ఏ సమస్యా రాలేదు. కానీ ఓ వ్యక్తి చేతిలో ఆమె తీవ్రంగా నష్టపోయినట్లు తెలుస్తోంది. ఆ వ్యక్తి ఆమెను ఆస్తిపరంగా మోసం చెయ్యడమే కాకుండా.. ఆమె జీవితంలో సంపాదించుకున్న డబ్బును కూడా దోచుకున్నారన్నది ఆమె నుంచి వస్తున్న ఆరోపణ. ఆ వ్యక్తికి బీజేపీలోని సీనియర్లు సపోర్ట్ చేస్తూ, తనకు న్యాయం చెయ్యట్లేదని ఆమె అంటున్నారు.
తాను, తన కూతురూ సెటిల్ అయ్యి, సురక్షితంగా ఉన్నామనుకున్న దశలో.. సీ అళగప్పన్ అల్లకల్లోలం చేశాడనీ, తన డబ్బు, డాక్యుమెంట్లు, ఆస్తులను కాజేశాడని గౌతమి చెబుతున్నారు. అళగప్పన్.. 20 ఏళ్ల కిందట ఆమె జీవితంలోకి ప్రవేశించాడు. అప్పటికే గౌతమీ తల్లిదండ్రులను కోల్పోయింది. పైగా పసికందుతో ఉంది. అతన్ని నమ్మి, ఆస్తులు, భూముల పత్రాలను అతని చేతిలో పెట్టింది. అతను తనను మోసం చేసిన విషయాన్ని ఈమధ్యే తెలుసుకున్నానన్న గౌతమీ.. తన కుటుంబంలోకి తమను ఆహ్వానిస్తున్నట్లు నటిస్తూ.. నిండా ముంచాడని ఆమె అంటోంది.

ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే ఎప్పుడు స్లిమ్ గా ఉంటారు..

ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే ఎప్పుడు స్లిమ్ గా ఉంటారు..

తనకు జరిగిన అన్యాయంపై గౌతమీ న్యాయపోరాటం చేస్తున్నా.. అడుగడుగునా కొందరు తనకు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆమె లేఖలో తెలిపారు. అళగప్పన్ 40 రోజులుగా పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం ఉందని గౌతమి తెలిపారు.

తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..

]

Source link

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india