టిబెటన్ మార్కెట్ ఉన్ని బట్టలు షాపింగ్ చేయడానికి ఉత్తమ ప్రదేశం. ఇక్కడ పిల్లల నుంచి పెద్దల వరకూ నాణ్యమైన స్వెటర్లు అందుబాటులో ఉంటాయి. ఈ మార్కెట్ ఢిల్లీలోని కశ్మీర్ గేట్ మెట్రో స్టేషన్ సమీపంలో ఉంది. అయితే ఈ మార్కెట్ సోమవారాల్లో మూసివేసి ఉంటుంది.మొనాస్టరీ మార్కెట్ ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులకు షాపింగ్ చేయడానికి అత్యంత ఇష్టమైన ప్రదేశాలలో ఒకటి. ఈ మార్కెట్ లో అన్ని బ్రాండ్ల దుస్తులను కాపీలో సులభంగా పొందవచ్చు, అది కూడా చౌక ధరలకే. ఈ మార్కెట్ మొనాస్టరీ పేరుతో ఢిల్లీలోని పితంపుర సమీపంలోని సరస్వతి విహార్‌లో ఉంది. ఇక్కడ మీరు శీతాకాలం కోసం జాకెట్లు మరియు స్వెటర్ల అద్భుతమైన సేకరణను ఉంటుంది.మీ బడ్జెట్ కొంచెం తక్కువగా ఉంటే.. ఉన్ని బట్టలు చౌకగా కొనుగోలు చేయాలనుకుంటే, ఢిల్లీలోని గాంధీ నగర్ మార్కెట్‌కి వెళ్లవచ్చు. ఇక్కడ స్వెటర్ల నుండి జాకెట్ల వరకు ప్రతిదీ తక్కువ ధరలకుకరోల్ బాగ్ చౌకగా ఉన్న ఉన్ని దుస్తులను కొనుగోలు చేయడానికి మంచి ప్రదేశం. ఇక్కడ చాలా తక్కువ ధరలకు ట్రెండ్ మరియు మంచి నాణ్యమైన శీతాకాలపు దుస్తులను పొందుతారు. ఇక్కడ పెద్ద బ్రాండెడ్ దుకాణాలు మరియు వీధి మార్కెట్లు ఉంటాయి. ఇక్కడ మీరు అన్ని రకాల షాపింగ్ చేయవచ్చు.సరోజినీ నగర్ మార్కెట్ అమ్మాయిల షాపింగ్‌కు చాలా ప్రసిద్ధి. శీతాకాలపు దుస్తులకు సంబంధించిన మంచి సేకరణ కూడా ఇక్కడ అందుబాటులో ఉంది. ఈ మార్కెట్లోని ప్రత్యేకత ఏమిటంటే, లేటెస్ట్ మరియు స్టైలిష్ వింటర్ వేర్ ఇక్కడ చాలా చౌక ధరలకు అందుబాటులో ఉంటుంది. ఇది మాత్రమే కాదు, చవకైన మరియు మంచి శీతాకాలపు బట్టలు ఇక్కడ తప్ప మరే ఇతర మార్కెట్లో దొరకవు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..