వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని సాలూరా మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్థానిక ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అల్లే రమేష్ గారు వారి కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. జ్ఞానం, విజ్ఞానం, సృజనాత్మకతకు ప్రతీక అయిన సరస్వతీ దేవి ఆశీస్సులతో విద్యార్థులు విద్యారంగంలో ఉత్తమ ఫలితాలు సాధించాలని, యువత జ్ఞానసంపత్తితో సమాజాభివృద్ధికి తోడ్పడాలని ఆయన ఆకాంక్షించారు.
విద్యార్థులు విద్యపై మరింత ఆసక్తి చూపిస్తూ క్రమశిక్షణతో ముందుకు సాగాలని, విద్యే భవిష్యత్తుకు బాట వేస్తుందని ఆయన సూచించారు. ఈ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో సాగింది.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








