✍️ రోడ్డు భద్రత నియమాలు పాటించరు.
✍️పరిశీలించకుండానే అధికారులు ఫిట్నెస్ లు ఇచ్చేస్తారు?
✍️ బస్సులు తోలే డ్రైవర్లకు పత్రాలు ఉన్నాయా!
✍️ ఇలాంటివి ఎన్ని ప్రమాదాలు చోటుచేసుకున్న అధికారులకు పట్టదా.
✍️ పట్టణంలో ఓ పాఠశాల నిర్లక్ష్యం ఆకాశాన్ని అంటుతుంది.
✍️ నిర్మాణ దశలో ఉన్న పాఠశాలలో తరగతుల కొన సాగింపు.
✍️ మండల విద్యాశాఖ అధికారులకు పట్టింపు లేదా!
✍️ ప్రాణాల మీదకు వస్తే కానీ పట్టించుకోరా!
బోధన్ : పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం వలననే బస్సుల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.గురువారం ఓ పాఠశాల బస్సు ప్రమాదానికి గురైంది.విద్యార్థులు అందరూ సురక్షితంగా బయటకు రావడంతో విద్యార్థులు తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

రోడ్డు భద్రత నియమాలు పాటించకుండానే నిర్లక్ష్యంగా డ్రైవింగ్ తో ఇలాంటి ప్రమాదాలకు కారణానికి అద్దం పడుతుంది.సంబంధిత అధికారులు పాఠశాలల బస్సులకు ఫిట్నెస్ నిర్ధారణ చేయకుండానే కొన్ని పాఠశాలల బస్సులను నడుపుతూ పిల్లల ప్రాణాల మీదికి తెస్తున్నారని ప్రజలు గుసగుసలు పెడుతున్నారు.అధికారులు సైతం ఇలాంటి వారిపై చర్యలు తీసుకోకుండా మౌన ప్రదర్శన చేస్తున్నడంపై ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.బోధన్ పట్టణంలో ఒక పాఠశాల నిర్మాణ దశలో ఉన్నప్పటికీ ఆ భవనంలో తరగతులను కొనసాగించడంపై అనేక ఆగ్రహాలు వ్యక్తమవుతున్నాయి.నిర్మాణ దశలో ఉన్న భవనంలో తరగతులు నిర్వహించడం పై మండల విద్యాశాఖ అధికారులు పట్టించుకోరా అంటూ మండిపాటు వ్యక్తమవుతుంది.విద్యార్థి దశలో విద్యార్థులకు అన్ని రంగాలలో అవగాహన కనిపించవలసిన విద్యాసంస్థలు ఇలాంటి నిర్లక్ష్యపు ధోరణిలు వ్యవహరించడం బలహీన సమాజానికి దారులుతీస్తుంది.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....









