V1News Telangana

best news portal development company in india

పంచాయతీ కార్మికురాలిపై దాడి మహిళా అని చూడకుండా విచక్షణ రైతంగా కొంతమంది సమూహంతో దాడి చేయించారు

SHARE:

పంచాయతీ కార్మికురాలిపై దాడి

మహిళా అని చూడకుండా విచక్షణ రైతంగా కొంతమంది సమూహంతో దాడి చేయించారు..

నిజామాబాదు జిల్లా కోటగిరి మండలం చెందిన పంచాయతీ కార్మికురాలు హనుమవ్వకు బోధన్ పట్నంకు చెందిన గంగారం కుటుంబీకులు వరుసకు చిన్నాయన, రుద్రూరు మండలం కుందాపూర్ శివారులో ఉన్న తన సొంత వ్యవసాయ భూమిలో మహిళా అని చూడకుండా కొంతమంది సమూహంతో విచక్షణహితంగా దాడి చేశారు అని, తనకు వారి నుంచి ప్రాణహాని ఉందని తనకు న్యాయం చేయాలని ఆమె కోరింది ఈ సందర్భంగా రుద్రూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చి చికిత్స కోసం బోధన్ ఆసుపత్రికి రావడం జరిగిందని అన్నారు. వరుసకు గంగారం చిన్నాయన ఐతాడు అని తన భూమిని గతంలో ఒక ఎకరం భూమి అక్రమంగా, దౌర్జనంగా ,రౌడీజం చేసి కబ్జా చేసుకున్నాడని అదేవిధంగా మళ్ళీ ప్రభుత్వం గత 50 సంవత్సరాల క్రితం ఇచ్చిన ఒక ఎకరం 10 గుంటలు కూడా తన పొలం అంటూ తమకు రానీయకుండా సాగు చెయ్యనీయకుండా అడ్డుపడుతూ తనపై దాడి చేస్తున్నారు అని చంపేస్తానని హెచ్చరికలు చేస్తున్నారని గంగారంకు చెందిన పెద్ద కుమారుడు వచ్చి కొంత మందిని బోధన్ నుంచి తీసుకువచ్చి దాడి చేయించడం జరిగిందని మహిళ అని చూడకుండా ఘోరంగా తనపై దాడి చేయడం జరిగిందని తనకు గాయాలు పాలు అయ్యాయి అని, తాను రుద్రూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా చికిత్స కోసం బోధన్ ఏరియా ఆసుపత్రికి తరలించారు అని తెలిపింది. తనకు వికలాంగుడైన ఒక కుమారుడు ఉన్నాడని అయితే తన వెనుక పడ్డ మా చిన్నాయన గంగారం అనేక విధాలుగా చిత్రహింసలు పెట్టడం జరిగిందని ఆయన తర్వాత మళ్లీ ఆయన పెద్ద కుమారుడు ఇంకా కొంతమంది వచ్చి దాడులు చేస్తూ చంపేస్తామని హెచ్చరికలు చేస్తున్నారని వారి వల్ల ప్రాణా హాని ఉందని తనకు న్యాయం చేయాలని తన భూమి తనకు దక్కే విధంగా చేసి వారి నుంచి ప్రాణ రక్షణ కల్పించాలని ఆమె కోరింది.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india