Post Views: 94
బోధన్ పట్టణంలో గత నెల పాత బస్టాండ్ సమీపంలోని ఒక బంగారు దుకాణంలో జరిగిన దోపిడీ ఘటనకు సంబంధించి అంతరాష్ట్ర దోపిడీ ముఠాకు చెందిన మరో కీలక నిందితుడిని బోధన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా గురువారం బోధన్ ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు.

-
ఆయన మాట్లాడుతూ, గత నెలలో బోధన్ పట్టణంలోని జువెలరీ దుకాణంలో నలుగురు అంతరాష్ట్ర దోపిడీ దొంగలు చోరీకి పాల్పడి సుమారు 6 కిలోల వెండి ఆభరణాలు, 14 తులాల బంగారు ఆభరణాలను దొంగిలించారని బాధితులు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి పలువిధాల ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
తాజాగా నాలుగో నిందితుడైన మమ్మద్ మౌలాను అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి 1 కిలో వెండి మరియు 5 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ వెల్లడించారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
ఈ కేసును ఛేదించడంలో కీలకంగా పనిచేసిన పట్టణ ఎస్‌హెచ్‌ఓ వెంకట్ నారాయణ్, ఎస్‌ఐ మనోజ్, కానిస్టేబుల్ రవి, అనిల్‌లను ఏసీపీ శ్రీనివాస్ అభినందించారు. నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజల భద్రతే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








