V1News Telangana

best news portal development company in india

సాలూరా తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ…

SHARE:

తెలంగాణ ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో భాగంగా, సాలూరా మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో   సాలూరా మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కులను పంపిణీ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమానికి తహసీల్దార్ శేషి భూషణ్  హాజరై, లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ వారి జీవితాల్లో కొత్త ఆశను నింపుతున్నాయని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు.

 

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంధర్నా రవి, సాలూరా గ్రామ సర్పంచ్ సోక్కం లావణ్య రవి, ఫతేపూర్ సర్పంచ్ నూర్ అహ్మద్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇల్తేపు శంకర్, అల్లే జనార్దన్, ఖాజాపూర్ అశోక్, సాలూరా & ఫతేపూర్ ఉపసర్పంచులు భుయ్యన్ సురేష్, మోసిన్, డిస్కో సాయిలు, బసరే శివకాంత్ తదితరులు పాల్గొన్నారు.లబ్ధిదారులు ప్రభుత్వం అందిస్తున్న సహాయానికి కృతజ్ఞతలు తెలుపుతూ, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు తమ కుటుంబాలకు ఎంతో దోహదపడుతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india